'నాకు క్యారెక్టర్ లేదని ముద్ర వేశారు'

28 Apr, 2016 08:13 IST|Sakshi
'నాకు క్యారెక్టర్ లేదని ముద్ర వేశారు'

ముంబై: ఆత్మహత్య చేసుకున్న హిందీ టీవీ నటి ప్రత్యూష బెనర్జీ తన ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ తో జరిపిన చివరి ఫోన్ సంభాషణ ఆడియో క్లిప్ ను సోమవారం కోర్టుకు సమర్పించారు. రాహుల్ ముందుస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా మూడున్నర నిమిషాలు నిడివున్న ఈ ఆడియోను న్యాయస్థానం వింది. ఏప్రిల్ 1న ఆత్మహత్మకు గంట ముందు రాహుల్ తో ప్రత్యూష మాట్లాడింది.

ఆడియోలో ఇలా ఉంది
ప్రత్యూష: నన్ను క్యారెక్టర్ లేనిదానిలా ముద్రవేశారు. చంపుతామని నాకు బెదింపు కాల్స్ వస్తున్నాయి. మా అమ్మనాన్నలను కూడా ఫోన్లో బెదిరిస్తున్నారు. నాకు జీవితంలో ఇంకేం మిగిలిందిప్పుడు?

రాహుల్: ఇవేమి పెద్ద విషయాలు కాదు

ప్రత్యూష: రాహుల్ నీ ఈగోను పక్కనపెట్టు. ఇవేమి పెద్ద విషయాలు కాదని ఎలా చెబుతావు
ప్రత్యూష మాట్లాడుతుండగానే రాహుల్ రాజ్ సింగ్ ఫోన్ కట్ చేశాడు.

వీరిద్దరి మధ్య జరిగిన మరో ఫోన్ సంభాషణ ఆడియోను 'మిడ్-డే' పత్రిక మంగళవారం వెల్లడించింది. దీంట్లో సంభాషణ ఇలా కొనసాగింది.

ప్రత్యూష: నువ్వు మోసగాడివి. నన్ను వంచించావు. నా తల్లిదండ్రుల నుంచి నన్ను విడదీశావు. ఇప్పుడు చూడు నేనేం చేస్తానో.

రాహుల్: ఏమైంది. నేను ఇంటికి వచ్చి నీతో మాట్లాడతాను. ఇంటికి వస్తున్నాను. నేను ఇంటికి వచ్చే వరకు ఎటువంటి అఘాయిత్యానికి పాల్పడకు.

>