చాలా పొరపాట్లు చేశాను: నటి

29 Aug, 2016 11:46 IST|Sakshi
చాలా పొరపాట్లు చేశాను: నటి

ముంబై: సినిమా జీవితం ఆరంభంలో ఫ్యాషన్ పరంగా చాలా తప్పులు చేశానని బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ తెలిపింది. చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చినందున తనకు అప్పట్లో ఫ్యాషన్ పరిజ్ఞానం అంతగా లేదని వెల్లడించింది. లాక్మే ఫ్యాషన్ వీక్ వింటర్/ఫెస్టివ్ 2016లో ఆమె పాల్గొంది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘17 ఏళ్ల వయసులో బాలీవుడ్ లో అడుగుపెట్టాను. నాకప్పుడు ఫ్యాషన్ గురించి పెద్దగా తెలియదు. ఫ్యాషన్ పరంగా చాలా పొరపాట్లు చేశాను. అయినప్పటికీ నా డ్రెస్సులను అందరూ మెచ్చుకునేవారు.  సినిమాల్లోకి వచ్చేప్పటికి నేను చాలా  చిన్నపిల్లని. స్కూల్ నుంచి వచ్చి సినిమాల్లో నటించడం సరదాగా అనిపించేది. అప్పటికి నాకు పెద్దగా ఏమీ తెలియదు. దర్శకులు, నిర్మాతలు ఏ డ్రెస్సులు వేసుకోమంటే అవే వేసుకునేదాన్ని. ఇండస్ట్రీతో పాటు నేను ఎదుగుతూ వచ్చాను. ఫ్యాషన్ పరిజ్ఞానం కూడా పెంచుకున్నాను. ఇప్పుడు నా స్టయిల్ ను అందరూ ఇష్టపడుతున్నార’ని 42 ఏళ్ల కరిష్మా కపూర్ చెప్పింది.

అయితే ఇప్పటి హీరోయిన్లు ఫ్యాషన్ విషయంలో పెద్దగా కష్టపడాల్సిన పనిలేదని అంది. హీరోయిన్ల స్టయిల్ కోసం ఇప్పుడు ప్రత్యేకంగా టీమ్లు పనిచేస్తున్నాయని తెలిపింది. తనకు చేతినిండా ఎండార్స్మెంట్స్ ఉన్నాయని చెప్పింది.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా