నా కుటుంబం కోటి

27 May, 2020 00:00 IST|Sakshi

‘‘నా కుటుంబసభ్యులు కోటిమంది’’ అని తెగ సంబరపడిపోతున్నారు సమంత. దక్షిణాదిన టాప్‌ 5  హీరోయిన్ల జాబితాలో సమంత పేరు ఉంటుంది. ఇటు సోషల్‌ మీడియాలోనూ సమంతకు ఫాలోయర్స్‌ ఎక్కువే. అందుకు తాజా నిదర్శనం ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత ఫాలోయర్స్‌ సంఖ్య పది మిలియన్ల (కోటిమంది)కు చేరడమే. ‘‘నా ఫ్యామిలీ టెన్‌ మిలియన్స్‌కు చేరింది. ఈ సందర్భంగా నేను పది స్వచ్ఛంద సంస్థలకు సాయం చేయాలనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు సమంత. ట్వీటర్‌లో సమంతకు 8 మిలియన్స్‌ ఫాలోయర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో ‘జాను’ తర్వాత మరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదు సమంత. తమిళంలో మాత్రం ‘కాదువాక్కుల రెండు కాదల్‌’ అనే సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారు.

మరిన్ని వార్తలు