భార్య‌తో క‌లిసి పాట‌లు పాడిన అమీర్

4 May, 2020 15:01 IST|Sakshi

అటు వినోదం, ఇటు సందేశం రెండూ ముఖ్య‌మేనంటారు బాలీవుడ్‌ క‌థానాయ‌కుడు అమీర్ ఖాన్‌. కేవ‌లం తెర మీద క‌నిపిస్తే స‌రిపోద‌ని, తెర వెనుక సాయం కూడా చేయాలంటున్నారు. తాజాగా క‌రోనా వ్య‌తిరేక పోరాటంలో శ‌క్తివంచ‌న లేకుండా శ్ర‌మిస్తున్న వారికి నీరాజ‌నాలు అర్పించేందుకు "ఐ ఫ‌ర్ ఇండియా" లైవ్ క‌న్స‌ర్ట్‌ నిర్వ‌హించారు. ఇందులో టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా ఎంద‌రో న‌టీన‌టులు పాల్గొన్నారు. ఆదివారం రాత్రి ఏడున్న‌ర గంట‌ల‌కు ఫేస్‌బుక్ వేదిక‌గా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో విల‌క్ష‌ణ హీరో అమీర్ ఖాన్ త‌న భార్య కిర‌ణ్ రావుతో క‌లిసి పాల్గొన్నారు. ఈ దంప‌తులు అల‌నాటి పాట‌ను మ‌నోహరంగా ఆల‌పించారు. మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ష‌నిస్టు పాట కూడా ప‌ర్ఫెక్టుగా పాడారంటూ అభిమానులు ఆశ్చ‌ర్యానుభూతుల‌కు లోన‌వుతున్నారు. కాగా ఈ కార్య‌క్ర‌మం ద్వారా సేక‌రించిన విరాళాల‌ను తిండి, ప‌నీ లేక ఇబ్బందులు ప‌డుతున్న‌వారికి సాయం అందిస్తామ‌ని తెలిపారు.‌ (ప్రేమ విషయాన్ని దాచలేదు: హీరో కూతురు)

చ‌ద‌వండి: (పిండిలో నోట్ల క‌ట్ట‌లు: ఇది రాబిన్ హుడ్ ప‌నే)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా