సరొగసీ ద్వారా బిడ్డను కంటా: హీరోయిన్

7 Nov, 2016 12:57 IST|Sakshi
సరొగసీ ద్వారా బిడ్డను కంటా: హీరోయిన్
ఇప్పటికే ఇద్దరు బిడ్డలున్న హీరోయిన్ కిమ్ కర్దాషియాన్.. ఈసారి సరొగసీ పద్ధతిలో మూడో బిడ్డను కనాలని భావిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించింది. ఇప్పుడు తాను సరొగసీ విధానాన్ని అవలంబించాలని కచ్చితంగా నిర్ణయించుకున్నట్లు ఆమె తెలిపింది. 'కీపింగ్ అప్ విత్ ద కర్దాషియాన్స్' అనే కొత్త ఎపిసోడ్ ప్రోమో విడుదల సందర్భంగా ఆమె ఈ విషయాన్ని చెప్పింది. 
 
అయితే.. కిమ్ నిర్ణయం విని ఆమె తల్లి క్రిస్ జెన్నర్ షాకయ్యారు. కిమ్ కర్దాషియాన్ (36)కు ఇప్పటికే భర్త కేన్ వెస్ట్‌తో కలిసి నార్త్ వెస్ట్ అనే కూతురు, సెయింట్ వెస్ట్ అనే కొడుకు ఉన్నారు. ఇప్పుడు మూడో బిడ్డను కనడానికి గర్భం దాల్చే ఓపిక లేదో ఏమోగానీ.. సరొగసీ విధానం అయితే మంచిదని ఆమె అనుకుంటోంది.