మగవాళ్ల ఓరచూపులు భలే ఉంటాయి!

11 May, 2015 22:38 IST|Sakshi
మగవాళ్ల ఓరచూపులు భలే ఉంటాయి!

‘‘పనీ పాటా లేదు పోకిరీ వెధవకు’’... అబ్బాయిలు చూసినప్పుడు చాలామంది అమ్మాయిలు అనుకునే మాటలివి. కానీ, అదంతా చిరుకోపమే. ఎందుకంటే, ఏ అమ్మాయి అయినా ‘మేల్ అటెన్షన్’ కోరుకుంటుంది. ఉదాహరణకు విద్యాబాలన్‌ను చెప్పుకుందాం. పురుషుల దృష్టి నా మీద పడ్డప్పుడు తెగ ఆనందపడిపోతానని ఆమె అంటున్నారు. ఇంకా చెబుతూ     -‘‘మగాళ్ల దృష్టి తన మీద పడాలని ఏ స్త్రీ అయినా కోరుకుంటుందని నా ఫీలింగ్. ఒకవేళ నా అభిప్రాయంతో ఏకీభవించకపోతే నో ప్రాబ్లమ్. ఎవరి అభిప్రాయం వాళ్లది. నా మటుకు నేను ‘మేల్ అటెన్షన్’ని కోరుకుంటా.
 
 ‘ఛీ పాడు.. అలా చూస్తున్నాడేంటి’ లాంటి కామెంట్లు చేయను. ఎందుకంటే, మగవాడి కన్ను పడకపోతే నా అందం మీద నాకు డౌట్ వచ్చేస్తుంది. ఏంటీ మరీ ఇంత ఓపెన్‌గా చెబుతోందనుకోకండి. నేనిక్కడ మాట్లాడుతున్నది కేవలం చూపుల గురించి మాత్రమే. శృంగారం గురించి కాదు. మగవాళ్ల ఓర చూపులు భలే ఉంటాయి. నన్నెవరైనా ఆ టైప్‌లో చూస్తుంటే, నాకు భలే ఆనందంగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు ఆరోగ్యానికి మంచిదే. కానీ, చూపులతో ఆగకుండా మరేదో కోరుకుంటేనే తేడా వచ్చేస్తుంది. అంతవరకూ వెళ్లకుండా జస్ట్ లుక్స్ వరకూ సరిపెట్టుకునే ‘మేల్ అటెన్షన్’ నాకిష్టం’’ అన్నారు.