విలన్‌గా చేస్తా

12 Jan, 2014 05:09 IST|Sakshi
విలన్‌గా చేస్తా
 అందరికీ అన్ని రకాల పాత్రలు అమరడం కష్టం. ఎన్ని చిత్రాలు చేసినా కొందరు తన నట దాహార్తిని తీర్చే పాత్ర లభించలేదని వాపోతుంటారు. కథానాయికల విషయానికొస్తే నటి త్రిష హీరోయిన్‌గా దశాబ్దకాలం పూర్తి చేసుకున్నా ఇప్పటికీ చెక్కుచెదరని సౌందర్యంతో ప్రకాశిస్తునే ఉన్నారు. ఈ ముద్దుగుమ్మ పలు భాషా చిత్రాల్లో నటించారు. వాటిలో చాలా వరకు విజయం సాధించాయి. అయితే అవన్నీ ప్రేమికురాలి పాత్రలకు పరిమితమయ్యాయి.  మొళి, చంద్రముఖి చిత్రాల్లో జ్యోతిక పాత్రల్లా, అరుంధతి చిత్రంలో అనుష్క పాత్ర మాదిరి త్రిషకు లభించలేదనే చెప్పాలి. దీంతో ఈ చెన్నై బ్యూటీకి వైవిధ్యభరిత పాత్రలు చేయాలనే కోరిక పుట్టిందట. దీనిపై త్రి ష మాట్లాడుతూ, తనలోని నటనా ప్రతిభను వెలికి తీసే పాత్ర ఇప్పటికీ లభించలేదన్నారు. మూస పాత్రల్లో నటించి బోర్ కొట్టిందని చెప్పారు. సవాల్‌తో కూడిన పాత్రల్లో నటించాలనుకుంటున్నట్లు తెలిపారు. అది ప్రతినాయకి పాత్ర అయినా చేయడానికి సిద్ధమేనంటున్న కోరిక నెరవేరేనా? ఎందుకంటే ఈ అందాల భామ విలనిజాన్ని ఆమె అభిమానులు హర్షిస్తారా? అన్నది సందేహమే. 
 
నటి త్రిషకు అరెస్టు వారెంటా? 
 నటి త్రిషకు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిందా? ప్రస్తుతం కోలీవుడ్‌లో కల కలం పుట్టిస్తున్న టాపిక్ ఇదే. ఈ అందాల తార బాత్‌రూమ్‌లో జలకాలాడే దృశ్యాలు ఇంటర్‌నెట్‌ల్లోనూ, పత్రికల్లోనూ ప్రచారమై ఎనిమిదేళ్ల క్రితం సంచలనం సృష్టించింది. దీన్ని త్రిష తల్లి తీవ్రంగా ఖండించారు. అవి తన కూతురుకు సంబంధించిన ఒరిజినల్ దృశ్యాలు కావని మార్ఫింగ్ చేసిన నకిలీ దృశ్యాలంటూ, ప్రచురించిన ప్రత్రికపై చెన్నై ఎగ్మూర్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. అయితే ఈ కేసు విచారణ సమయంలో త్రిష తల్లి ఉమ కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి త్రిష, ఆమె తల్లి ఉమపై అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన త్రిష తరపు న్యాయవాది కోర్టు త్రిషకు అరెస్టు వారెంట్ జారీ చేయలేదని ఆమె తల్లి ఉమకు అరెస్టు వారెంట్ జారీ చేసిందని వివరించారు. ఈ అరెస్టు వారెంట్‌ను చట్టపరంగా ఎదుర్కొంటామని అన్నారు.  
 

 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి