ప్రేమ... ద్వేషం

23 Jul, 2015 23:29 IST|Sakshi
ప్రేమ... ద్వేషం

రాజ్, గీతాభగత్ జంటగా స్వీయ దర్శకత్వంలో మహేశ్ నిర్మించిన చిత్రం ‘కలయా నిజమా’. వంశీకృష్ణ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత దామోదర్ ప్రసాద్ ఆవిష్కరించారు. ‘‘మహేశ్ ఈ కాన్సెప్ట్ నాకు చెప్పాడు. కానీ, దర్శక, నిర్మాతగా రెండు బాధ్యతలు కష్టమవుతుందేమో అన్నాను.
 
 కొన్ని రోజుల తర్వాత సినిమా పూర్తి చేశానని చెప్పాడు. ఎంతో మమకారంతో ఈ సినిమా చేశాడు’’ అని దామోదర ప్రసాద్ అన్నారు. ఈ చిత్రం ట్రైలర్ చూసి, దాసరి నారాయణరావుగారు ఇంప్రెస్ అయ్యారని దర్శకుడు రేలంగి నరసింహారావు చెప్పారు.
 
 మంచి పాటలివ్వడానికి ఆస్కారం ఉన్న కథ అని వంశీకృష్ణ తెలిపారు. ప్రేమ, ద్వేషం నేపథ్యంలో సాగే చిత్రం ఇదనీ, భార్యాభర్తల మధ్య ద్వేషం ఏర్పడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేది కథ అని మహేశ్ చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నవీన్ జోయెల్.