ఐ లవ్‌ యూ చెబుతారా?

23 Jun, 2019 06:14 IST|Sakshi
కార్తీ

కన్నడ, తెలుగు భాషల్లో హీరో ఉపేంద్రతో ‘ఐ లవ్‌ యూ’ చెప్పించారు దర్శకుడు ఆర్‌. చంద్రు. ప్రేమలో కొత్తకోణం చూపించాం అంటూ తెరకెక్కిన ఈ చిత్రం జూన్‌ 14న రిలీజ్‌ అయింది. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో రీమేక్‌ కాబోతోందని తెలిసింది. ఈ తమిళ రీమేక్‌ను కూడా ఒరిజినల్‌ చిత్రాన్ని తెరకెక్కించిన ఆర్‌. చంద్రునే డైరెక్ట్‌ చేస్తారట. ‘‘ఈ సినిమాను తమిళంలో రీమేక్‌ చేయడం సంతోషంగా ఉంది. ఇంకా నటీనటులను ఫైనలైజ్‌ చేయలేదు. ఈ ప్రాజెక్ట్‌లో కార్తీ నటిస్తే బావుంటుంది అనుకుంటున్నాను. అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ త్వరలో చేస్తాం’’ అని దర్శకుడు పేర్కొన్నారు. మరి తమిళంలో కార్తీ ‘నాన్‌ ఉన్నై కాదలిక్కరేన్‌’ అని చెబుతారా? అదేనండీ... తమిళంలో ఐ లవ్‌ యూ చెబుతారా? వేచి చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా