అధిక బరువు వల్లే డాన్స్ కు దూరమయ్యా: శిల్పాశెట్టి

26 Oct, 2013 20:55 IST|Sakshi
అధిక బరువు వల్లే డాన్స్ కు దూరమయ్యా: శిల్పాశెట్టి

న్యూఢిల్లీ: ‘మై ఆయీ హూ యూపీ బీహార్ లూట్నే’, ‘షటప్ అండ్ బౌన్స్’ వంటి నృత్యగీతాలతో అదరగొట్టిన శిల్పాశెట్టి డాన్స్‌కు కొంతకాలంగా దూరమవుతున్నానంటూ బాధపడుతోంది. ప్రముఖ డ్యాన్స్ రియాల్టీ షో ‘నచ్ బలియే’కు ఆమె న్యాయనిర్ణేతగా పనిచేస్తోంది.  దర్శకుడు సాజిద్ ఖాన్, కొరియోగ్రాఫర్ టెరెన్స్ లీవైస్ కూడా దీనికి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ‘నచ్ బలియే కొత్త భాగం నూతన డ్యాన్సర్లతో అద్భుతంగా ఉంది. బిడ్డ పుట్టిన తరువాత అధిక బరువు వల్ల నేను డ్యాన్స్‌కు దూరమయ్యాను. ఇలాంటి అద్భుత షోలకు రాలేకపోయాను. అయితే పాపను చూసిన మరుక్షణమే ఇలాంటి ఆలోచనలన్నీ దూరమవుతాయి. ఈ షో ద్వారా నా అభిమానులకు కూడా దగ్గరయ్యే అవకాశం దక్కింది’ అని ఈ బెంగళూరు బ్యూటీ వివరించింది.
 
 

ఇక కొత్త భాగం సినీనటులు, వారి భార్యలతో ఉత్సాహంగా కొనసాగుతోంది. హాస్యనటుడు రాజు, ఆయన భార్య శిఖా శ్రీవాత్సవ్, రాకేశ్ వశిష్ట్, రిద్దీ డోగ్రీ, గుర్మీత్ చౌదరి, డెబీనా, బ్రూనా అబ్దుల్లా, ఒమర్ ఫారూఖీ, రిత్విక్ ధంజానీ, ఆశా నేగి వంటి జంటలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ విషయమై శిల్ప స్పందిస్తూ ‘ఈసారి నిజంగా ఆసక్తికర వ్యక్తులు షోలో కనిపిస్తున్నారు. రెండు కాళ్లూ లేని వినోద్ ఠాకూర్ కూడా వచ్చాడు. ఇతడు డాన్స్ చేస్తుంటే.. భగతంతుడు ఎంత గొప్పవాడో అర్థమయింది. ఠాకూర్ డాన్స్ అద్భుతంగా ఉంది. ఎంతో సానుకూల దృక్పథం కలిగిన వ్యక్తి అతడు’ అని తెలిపింది. రాజు అందరినీ నవ్విస్తాడని, మిగతా అందరిలోనూ ఎంతో ప్రతిభ ఉందని ప్రశంసించింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా

కుశలమా? నీకు కుశలమేనా?

లెటజ్‌ ఫైట్‌ కరోనా

చిన్న‌ప్పుడే డ్ర‌గ్స్‌కు బానిస‌గా మారాను: క‌ంగ‌నా

కరోనా: నారా రోహిత్‌ భారీ విరాళం

సిగ్గుప‌డ‌ను.. చాలా వింత‌గా ఉంది

అందుకే మేం విడిపోయాం: స్వరభాస్కర్‌