'మావాళ్లే నన్నలా పెంచారు'

25 May, 2016 14:08 IST|Sakshi
'మావాళ్లే నన్నలా పెంచారు'

చెన్నై: తానెప్పుడూ స్టార్ డమ్ కోరుకోనని ప్రముఖ సినీ హీరో శింబు అన్నారు. గత 20 ఏళ్లుగా తమిళ చిత్ర పరిశ్రమలో వెలుగొందుతున్న ఆయన పేరు ప్రతిష్టలు పెద్దగా పట్టించుకోనని చెప్పారు. 'నాకు తొలిసారి కెమెరాముందుకు ఎప్పుడు వెళ్లాననే విషయం కూడా గుర్తు లేదు. నట వారసత్వం ఉన్న కుటుంబం నుంచే నేను వచ్చాను.

చాలా యుక్తవయసులో ఉండగానే నేను నటనలో అడుగుపెట్టాను. నాకు అర్ధం చేసుకునే వయసు లేనప్పుడే స్టార్ డమ్ వచ్చింది. మా అమ్మవాళ్లే నన్నలా పెంచారు. అందుకే పేరు ప్రఖ్యాతలు, స్టార్ డమ్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. మమ్మల్ని అంతా పనికిరానివాళ్లుగా భావిస్తారు. రేపు నాతో సినిమాలు తీసేందుకు ఎవరూ ముందుకు రాకపోయినా.. నాకు తెలుసు.. నా చిత్రాన్ని నేనే తీసుకోగలనని' అని శింబు చెప్పారు. శింబు నటించిన కామెడీ చిత్రం 'ఇదు నమ్మ ఆలు' ఆలస్యంగా విడుదలవుతున్న విషయం తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి