మద్యపానం మానేశా : నటి

24 Dec, 2019 07:52 IST|Sakshi

చెన్నై,పెరంబూరు: మద్యం తాగడాన్ని మానేశానంటోంది నటి సోనా. శృంగార తారగా ముద్ర వేసుకున్న ఈ భామ తమిళంతో పాటు పలు భాషల్లో నటించింది. తమిళంలో కుశేలన్‌ షాజహాన్, గురు ఎన్‌ఆళు వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందింది. చివరిగా గత ఏడాది ప్రశాంత్‌ హీరోగా నటించిన జానీ చిత్రంలో కనిపించింది. ఈ అమ్మడు చాలా డేరింగ్‌ లేడీ అనే పేరు తెచ్చుకుంది. పొగ తాగడం, మద్యం సేవించడం వంటి దురలవాట్లు కూడా ఈమెకి ఉన్నాయి. ఆ మధ్య చిత్ర నిర్మాణం కూడా చేపట్టింది.అయితే అది ఆదిలోనే ఆగిపోయింది. ఇకపోతే అంతకు ముందు ఏదో వివాదంతో తరచూ  వార్తల్లో ఉండే సోనా ఈ మధ్య ఎక్కడా కనిపించడం లేదు. దీంతో నటి సోనా నటనకు గుడ్‌బై చెప్పిందనీ, అసలు ఆమె ఎక్కడికో వెళ్లిపోయిందనే ప్రచారం జరుగుతోంది.

దీంతో సోనా స్పందించింది.ఒక ప్రకటనను సోమవారం మీడియాకు విడుదల చేసింది. అందులో కొందరు తన గురించి నిరాధార ప్రచారం చేస్తున్నారని, తాను సినిమాల్లో నటించడం లేదనీ, ఎక్కడికో వెళ్లిపోయాను అనీ ప్రచారం చేస్తున్నారని వాపోయింది. నిజానికి తాను ఎక్కడికీ వెళ్లలేదని, నటనకూ దూరం కాలేదని వివరించింది. ఈ ఏడాది నాలుగైదు చిత్రాల్లో నటించానని, 12 చిత్రాలను నిరాకరించినట్లు చెప్పింది. జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని భావిస్తున్నానని చెప్పింది. డబ్బు కోసం పరుగులు తీయాల్సిన అవసరం తనకు లేదని చెప్పింది. ఇంతకు ముందులా కాకుండా తానిప్పుడు చాలా పరిపక్వత చెందినట్లు పేర్కొంది. మద్యపానం మానేశానని చెప్పింది. ఈ ఏడాదిలో తాను ఛేజింగ్, పరమ పదం విళైయాట్టు, అసాల్ట్, తేడుదల్, పచ్చమాంగా తదితర చిత్రాల్లో నటించానని, నూతన సంవత్సరంలో మరిన్ని మంచి అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నానని నటి సోనా తెలిజేశారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నన్ను సైకో సత్య అంటారు

మరో థ్రిల్లర్‌

శశి కథేంటి?

సీక్వెల్‌లో

ఖోఖో నేపథ్యంలో...

అక్షర సందేశం

నాన్నకు తెలియకుండా సినిమా చేశా

అదిరిపోయిన వర్మ ‘బ్యూటిపుల్‌’ సాంగ్‌

సైనికుడు గర్వపడేలా ‘సరిలేరు నీకెవ్వరు’ ఆంథమ్‌

యాంకర్ అనసూయకు పన్ను సెగ

మూడు రాజధానులు స్వాగతిస్తున్నా: చిన్నికృష్ణ

వసూళ్ల పండగే.. ఓపెనింగ్స్‌ అదుర్స్‌

స్నేహితులతో చిందులేసిన మలైకా

కొడుకు కావాలని నేను అడగలేదు: అర్బాజ్‌ ఖాన్‌

‘డ్రగ్‌లా ఎక్కేస్తున్నావ్‌, అడిక్ట్‌ అవుతున్నాను’

నాకు నటించడం రాదు: నటుడు

రష్మిక కలలు చాలా పెద్దవి : రక్షిత్‌

నేను రాలేకపోతున్నాను: బిగ్‌ బీ

మాజీ ప్రియురాలితో..

బాయ్‌ఫ్రెండ్‌తో మాల్‌దీవులకు..

మా ప్రయత్నాన్ని ఆదరించారు

సస్పెన్స్‌ థ్రిల్లర్‌

రజనీ కూతురు?

మళ్లీ జోడీ

మహాప్రస్థానం మొదలైంది

రాకీ భాయ్‌ ఈజ్‌ బ్యాక్‌

మత్తు వదలరా ఎంతో నచ్చేసింది

నవ్విస్తూనే హృదయాలను హత్తుకుంది

రెండేళ్ల ప్రయాణం ఇద్దరిలోకం ఒకటే

యాక్షన్‌ షురూ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మద్యపానం మానేశా : నటి

నన్ను సైకో సత్య అంటారు

మరో థ్రిల్లర్‌

శశి కథేంటి?

సీక్వెల్‌లో

ఖోఖో నేపథ్యంలో...