భాష ఏదైనా బెస్ట్‌ ఇవ్వాలనుకుంటా

27 Jul, 2018 01:29 IST|Sakshi
మిథిలా పాల్కర్, దుల్కర్‌ సల్మాన్, ఇర్ఫాన్‌ ఖాన్‌

దుల్కర్‌ సల్మాన్‌

‘‘యాక్టర్‌గా వేరే వేరే భాషల్లో సినిమాలు చేయడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంటుంది. ‘మహానటి’ సినిమాలో నన్ను తెలుగు ఆడియన్స్‌ బాగా రిసీవ్‌ చేసుకున్నారు’’ అని మలయాళ హీరో దుల్కర్‌ సల్మాన్‌ అన్నారు. దుల్కర్‌ సల్మాన్‌ బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న చిత్రం ‘కార్వాన్‌’. ఇర్ఫాన్‌ ఖాన్, మిథిలా పాల్కర్‌ ముఖ్య పాత్రల్లో దర్శకుడు ఆకర్ష్‌ కురానా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా ఆగస్ట్‌ 3న విడుదల కానుంది.

ఈ సందర్భంగా దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ – ‘‘మలయాళంలో హీరోగా చేస్తున్నాను కాబట్టి బాలీవుడ్‌కు పరిచయం అవుతున్న సినిమాలోనూ నేనే లీడ్‌ రోల్‌ చేయాలి అనుకోలేదు. కథతో పాటు క్యారెక్టర్‌ ఉండాలి అనుకుంటాను. ఇర్ఫాన్‌ సార్‌ ఓకే అన్నారంటే స్క్రిప్ట్‌ కచ్చితంగా బావుంటుందని అనుకున్నాను.  ఏ భాషలో సినిమా చేసినా నా బెస్ట్‌ ఇవ్వాలనుకుంటాను’’ అన్నారు.  దర్శకుడు ఆకర్ష్‌ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాకి కీలకంగా నిలిచే ఓ పాత్రకు దుల్కర్‌ సరిపోతాడని మా క్యాస్టింగ్‌ డైరెక్టర్‌ చెప్పారు. అప్పుడే దుల్కర్‌ సినిమాలు చూశాను.

అవినాష్‌ అనే పాత్రకు అతనే సరిపోతాడని ఫిక్స్‌ అయ్యాను. కథ చెప్పినప్పుడు దుల్కర్‌ కూడా బాగా ఎగై్జట్‌ అయ్యారు. స్క్రిప్ట్‌ నచ్చి ఒప్పుకున్నారు. 34 రోజుల్లో సినిమా కంప్లీట్‌ చేశాం. అలా అయితే యాక్టర్స్‌ అందరూ క్యారెక్టర్స్‌కు స్టిక్‌ అయ్యి ఉంటారు. ఎనర్జీస్‌ సేమ్‌గా ఉంటాయి అని నా నమ్మకం. ఈ సినిమా షూటింగ్‌ అప్పుడు ఇర్ఫాన్‌ ఖాన్‌గారు బాగానే ఉన్నారు. ఫస్ట్‌ కాపీ కూడా చూశారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆయనకు కేన్సర్‌ వ్యాధి ఉందని బయటపడింది.

ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటారనుకుంటున్నాను’’ అన్నారు. మిథిలా పాల్కర్‌ మాట్లాడుతూ – ‘‘ఈ షూటింగ్‌ అంతా ఓ లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌లా ఉంది. ఇర్ఫాన్, దుల్కర్‌ వంటి యాక్టర్స్‌తో వర్క్‌ చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్‌. కేవలం సినిమాలే అని నన్ను నేను రిస్ట్రిక్ట్‌ చేసుకోను. యూ ట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, సినిమాలు, థియేటర్‌... ఎక్కడ ఎగై్జటింగ్‌ కాన్సెప్ట్‌ ఉంటే అక్కడ చేస్తాను’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా