చనిపోవాలనుకున్నా: నటి సంచలన పోస్ట్‌

11 May, 2018 12:44 IST|Sakshi

‘‘నిజానికి అది నరకం అన్న సంగతి కూడా నేను గుర్తించలేకపోయా. కొందరు ‘చిన్నపిల్లవేగా నీకేంటమ్మా సమస్య’  అనేవాళ్లు. ఇంకొందరేమో ‘లైఫ్‌లో ఇదొక ఫేజ్‌ అంతే’ అని చెప్పేవాళ్లు. నాకు రాత్రుళ్లు ఉన్నట్టుండి దిగ్గున మెలకువ వచ్చేది. అప్పటిదాకా నిద్రపోలేదన్న సంగతి గుర్తొచ్చి ఏడుపొచ్చేది. నాలో కోపం ఎందుకు పెరుగుతోందో కూడా ఆలోచించుకోలేకపోయా.. అసహనంతో అన్నం ఎక్కువగా తినడంతో లావైపోయా. చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నా... ప్రతి సందర్భంలోనూ నేను చేసేది కరెక్టే అనిపించేది. అమ్మానాన్నలు, డాక్టర్లు చెప్పేది పనికిరాని విషయంగా అనిపించేది..’ అంటూ తన ఒకప్పటి తన దీనస్థితిని గుర్తుచేసుకున్నారు ‘దంగల్‌’ ఫేం జైరా వసీం. ఆ స్థితి భయంకరమైన డిప్రెషన్‌ అని గుర్తించిన తర్వాత కోలుకోవడానికి సమయం పట్టిందని, ఆ మాయదారి జబ్బు ఎప్పుడైనా, ఎవరికైనా ఎదురయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. గుండెలు పిండేసే రీతిలో ఈ మేరకు ఆమె రాసిన లేఖ చర్చనీయాంశమైంది.

‘‘పాతికేళ్లు దాటినవాళ్లకే డిప్రెషన్‌ ఉంటుందని ఎక్కడో చదివా. కానీ అతి తప్పు కౌమార దశ(10 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు)లోనూ దాని బారినపడతారు. అందుకు నేనే ఉదాహరణ. నాలుగేళ్ల చికిత్స తర్వాతగానీ కోలుకోలేకపోయా. ఇప్పుడు నా గురించి నేను స్పష్టంగా, ధైర్యంగా ఆలోచించగలనన్న నమ్మకం ఏర్పడింది. కొన్నాళ్లపాటు అన్నింటికీ.. ముఖ్యంగా సోషల్‌ మీడియాకు దూరంగా ఉండాలనుకుంటున్నా. రాబోయే పవిత్ర రంజాన్‌ మాసం అందుకు అనువైనదిగా భావిస్తున్నా. దయచేసి మీ ప్రార్థనల్లో నన్ను గుర్తుచేసుకోండి. ఎత్తుపల్లాల్లో నాకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా నా ఫ్యామిలీకి ఒట్టి థ్యాంక్స్‌ చెబితే సరిపోదు..’’ అని జైరా పేర్కొన్నారు.
జైరా లేఖ యథాతథంగా..
 

>
మరిన్ని వార్తలు