నిలువ నీడ లేకుండా గడిపా: జెన్నిఫర్ లోపేజ్

10 Jul, 2013 13:35 IST|Sakshi
నిలువ నీడ లేకుండా గడిపా: జెన్నిఫర్ లోపేజ్

కెరీర్ ఆరంభంలో నిలువ నీడ లేకుండా గడిపానని ప్రముఖ గాయని, నటి జెన్నిఫర్ లోపేజ్ తెలిపింది. తన తల్లి నుంచి విడిపోయిన తర్వాత డాన్స్ స్టూడియోలోనే పడుకునేదాన్నని వెల్లడించింది. నచ్చిన కెరీర్ ను ఎంచుకునే విషయంలో తన తల్లితో ఎన్నోసార్లు గొడవ పడ్డానని లోపేజ్ తెలిపినట్టు 'కాంటాక్ట్ మ్యూజిక్' పేర్కొంది.

'కాలేజీకి వెళ్లడానికి నేను ఇష్టపడేదాన్ని కాదు. డాన్స్ నేర్చుకోవడానికే పూర్తి సమయం కేటాయించాలనుకునే దాన్ని. దీంతో మా అమ్మకు, నాకు గొడవలయ్యేవి. నాకు నచ్చే పని చేయడం కోసం అమ్మతో విడిపోయా. ఇల్లు వదిలిపెట్టడంతో డాన్స్ స్టూడియోలోని సోఫాలోనే పడుకునేదాన్ని. కొన్ని నెలల తర్వాత నాకు యూరప్ లో డాన్సింగ్ జాబ్ వచ్చింది. దీని కోసమే నిన్ను వదులుకున్నానని మా అమ్మతో తర్వాత చెప్పా. అనంతరం అమెరికాలోని లాస్ ఏంజెలెస్ కు మారాను. ఇదంతా ఏడాది వ్యవధిలో జరిగింది' అని జెన్నిఫర్ తెలిపింది.

మొదట్లో లాస్ ఏంజెలెస్ అంటే తనకు పెద్దగా ఇష్డం ఉండేదికాదని 43 ఏళ్ల 'డాన్స్ ఎగైన్' స్టార్ జెన్నిఫర్ లోపేజ్ వెల్లడించింది. ప్రస్తుతం ఇక్కడ ఉండానికి ఎంతో ఇష్టపడుతున్నానని తెలిపింది.  ఐదేళ్ల వయసున్న తన కవల పిల్లలు మ్యాక్స్, ఎమ్మీలతో కలిసి జెన్నిఫర్ లాస్ ఏంజెలెస్ లో నివసిస్తోంది.