నన్ను తప్పించి.. పాక్ నటికి ఛాన్స్: హీరోయిన్

30 Oct, 2016 11:39 IST|Sakshi
నన్ను తప్పించి.. పాక్ నటికి ఛాన్స్: హీరోయిన్

ముస్లిం వ్యాపారవేత్త జీవితంలో చోటుచేసుకున్న సంఘటనల సమాహారంగా రూపొందిస్తున్న చిత్రం 'రాయిస్'. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్, పాకిస్తాన్ నటి మహీరాఖాన్ జంటగా నటిస్తున్న మూవీకి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. వాస్తవానికి ఈ మూవీలో తొలుత ఫెమినా మాజీ మిస్ ఇండియా-2011, అంకితా షోరేనును షారుక్ సరసన అవకాశం కల్పించారు. ఇంతలోనే ఏం జరిగింతో ఈ ప్రాజెక్టు నుంచి తనను తప్పించారని వదంతులు ప్రచారం అయ్యాయని అంకితా చెప్పింది.

స్క్రీన్ టెస్టులు చేసి తనకు ఆల్ మోస్ట్ ఒకే చెప్పారని, ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు షారుక్ తన పేరును సూచించినట్లు నటి అంకితా తెలిపింది. దర్శకుడు, నిర్మాత మాత్రం పాకిస్తాన్ కు చెందిన ముస్లిం యువతిని ఈ పాత్రకోసం తీసుకోవాలని భావించారట. 'నా స్థానంలో పాక్ నటి మహీరాఖాన్ కు ఛాన్స్ ఇచ్చారు. షారుక్ లాంటి అగ్రహీరో సరసన అవకాశం తృటిలో తప్పిపోయినందుకు కాస్త బాధపడ్డాను. కేవలం దేశానికి చెందిన నటిని కావడం వల్ల అవకాశం దక్కలేదు' అని తొలిసారిగా 'రాయిస్' మూవీలో హీరోయిన్ పాత్ర ఎంపిక గురించి అంకితా  చెప్పుకొచ్చింది. పాక్ ఆర్టిస్టులపై నిషేధం విధించడంతో మహీరా లేని కారణంగా షూటింగ్ మధ్యలోనే నిలిపివేశారు.