నేను బాగానే ఉన్నాను: కమల్ హాసన్

17 Sep, 2014 11:15 IST|Sakshi
నేను బాగానే ఉన్నాను: కమల్ హాసన్

చెన్నై : ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని ప్రముఖ సినీనటుడు కమల్ హాసన్ తెలిపారు. విహాహారం వల్ల ఆయన అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దాంతో కమల్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషాహారం వల్లే తాను అస్వస్థతకు గురయ్యారని, అంతకన్నా మరేమీ లేదన్నారు.

చాలామంది ఈ విషయాన్ని డ్రామా చేయాలని చూస్తారని, అందుకు వారిని నిరుత్సాహపరుస్తున్నట్లు కమల్ తెలిపారు.  కాగా కమల్ అనారోగ్యానికి సంబంధించి పలు వార్తలు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కమల్ నరాల వ్యాధితో బాధపడుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి. మంగళవారం షూటింగ్లో పాల్గొన్న ఆయన అస్వస్థతకు గురి అవటంతో చిత్ర యూనిట్ ఆయన్ని ఆస్పత్రికి తరలించిన విషయంవ తెలిసిందే.

ఇక కమల్ తన అనారోగ్యంపై వచ్చిన వార్తలను ఖండించారు. షూటింగ్ సందర్భంగా ఫుడ్ పాయిజన్తో పాటు డీహైడ్రేషన్ గురైనట్లు ఆయన పేర్కొన్నారు. అంతే తప్ప ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. కేరళలో మారుమూల ప్రాంతాల్లో షూటింగ్ సందర్భంగా అక్కడ సరైన హోటల్స్ లేనందున రోడ్డు పక్కన ఉండే దాబాల్లో తినేవారిమని, అలాగే కలుషిత నీరు తాగినట్లు చెప్పారు. కాగా బుధవారం కమల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. ప్రస్తుతం ఆయన 'పాపనాశనం' షూటింగ్లో పాల్గొంటున్నారు. మలయాళ, తెలుగులో ఘనవిజయం సాధించిన 'దృశ్యం' రీమేక్. డిశ్చార్జ్ అనంతరం కమల్ షూటింగ్లో పాల్గొననున్నట్లు సమాచారం.