అప్పుడే పెళ్లా?

25 Oct, 2013 04:16 IST|Sakshi
అప్పుడే పెళ్లా?
ఇప్పటికింకా నా వయసు నిండా 25. చీటికి మాటికి పెళ్లెప్పుడంటూ చిరాకు పుట్టించకండి అంటోంది నటి చార్మి. కోలీవుడ్, టాలీవుడ్‌లో సీనియర్ హీరోయిన్ల సరసన చేరిన ఈ బ్యూటీకి ప్రస్తుతం హీరోయిన్‌గా డిమాండ్ లేదు. ఐటమ్ సాంగ్స్, గెస్ట్ పాత్రలంటూ వరుస పెట్టి ఎడాపెడా నటించేస్తున్న చార్మితో పాటు తమన్న, సమంత, హన్సిక, ప్రియమణి లాంటి హీరోయిన్లు మూడుముళ్లకు ముందడుగులో ఉన్నట్లు సినీ వర్గాల టాక్. ఈ ప్రచారాన్ని సహ నటీమణులు ఖండించినట్లుగానే చార్మీ కూడా ఖండించింది. 
 
ఈ విషయ మై ఆమె మాట్లాడుతూ తన వయసు 25నే. అప్పుడే వివాహం చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసిం ది.  కొందరు తారల మాదిరిగా తాను స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నానని పేర్కొంది. ప్రస్తుతం తాను పోషిస్తున్న యవ్వనం ఉట్టిపడే గ్లామర స్ పాత్రలు తనకు 30 ఏళ్లు దాటిన తర్వాత ఎవరూ ఇవ్వరని అంది. అందువల్ల ప్రస్తుతానికి నటనపైనే పూర్తిగా దృష్టి సారిస్తున్నట్లు చెప్పింది. వివాహమంటూ జరిగితే అది తనకు బాగా తెలిసిన వారితోనే అవుతుందని తెలిపింది.
 
 తాను నటించే చిత్రాల కథలను ఒక్కసారి వినగానే ఒకే చెప్పడం లేదని, అదే విధంగా తొలి చూపులోనే ప్రేమించేయడం కుదరదని అంటోంది. ఈ జాణ కోలీవుడ్‌లో శింబు సరసన కాదల్ ఒళివరిల్లై చిత్రం ద్వారా పరిచయమైంది. ఈ చిత్రం 2002లో విడుదలైంది. అప్పుడు చార్మీ వయసు 18 ఉంటుందని, ఆ  విధంగా చూసుకుంటే ఈమె వయసు 29 ఉంటుందని, అలాంటిది తన వయసింకా 25 అని చెప్పుకుంటోందని కోడంబాక్కం వర్గాలు గుసగుసలాడుకుంటున్నారు.