ఈ సినిమాతో హ్యాట్రిక్‌ షురూ

21 Dec, 2019 02:36 IST|Sakshi
జి.ఆర్‌. కృష్ణ, రాజ్‌తరుణ్, ‘దిల్‌’ రాజు, అబ్బూరి రవి

‘‘లైఫ్‌ ప్రతివాడికి ఒక మూమెంట్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయని సర్‌ప్రైజ్‌ ఇస్తుందట.. ‘ఇద్దరిలోకం ఒకటే’ ట్రైలర్‌లోని డైలాగ్‌ ఇది. రాజ్‌ తరుణ్, షాలిని పాండే జంటగా ‘దిల్‌’ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. జి.ఆర్‌ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ నెల 25న విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ మధ్యకాలంలో నేను నా జర్నీల్లో ఈ సినిమాలోని పాటలనే వింటున్నాను. మిక్కీ జె.మేయర్‌ అద్భుతమైన మెలోడీలు ఇచ్చారు.

అబ్బూరి రవితో నేను ‘బొమ్మరిల్లు’ చిత్రం నుండి జర్నీ చేస్తున్నాను. ఈ చిత్రానికి కూడా మంచి డైలాగ్‌లు అందించారు. ఈ ఏడాది మా బేనర్‌లో ‘ఎఫ్‌–2’, ‘మహర్షి’ చిత్రాలతో బ్లాక్‌బస్టర్స్‌ కొట్టాం. ‘ఇద్దరిలోకం ఒకటే’తో హ్యాట్రిక్‌ సాధిస్తాం’’ అన్నారు. ‘‘చివరి 30 నిమిషాల సినిమాను ప్రేక్షకులు మరచిపోలేరు. హృదయాలతో చూసే ప్యూర్‌ లవ్‌స్టోరీ ఇది’’ అన్నారు అబ్బూరి రవి. ‘‘హృదయాలను కదిలించే ఫీల్‌గుడ్‌ మూవీ ఇది’’ అన్నారు రాజ్‌తరుణ్‌. ‘‘అభినందన’, నీరాజనం’ చిత్రాలను ఈ సినిమా గుర్తు చేస్తుంది’’ అన్నారు నిర్మాత బెక్కం వేణుగోపాల్‌.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కరోనా: క్వారంటైన్‌పై అగ్రహీరో వివరణ

కరోనా లాక్‌డౌన్‌: చిరు బాటలో నాగ్‌

శేష జీవితాన్ని ఇలా గడిపేస్తా: రేణుదేశాయ్‌

కరోనా: దూర‌ద‌ర్శ‌న్‌లో మ‌ళ్లీ షారుక్‌

‘ఫస్ట్‌ టైమ్‌ నెలకు 1000 రోజులు’

సినిమా

కరోనా: క్వారంటైన్‌పై అగ్రహీరో వివరణ

కరోనా లాక్‌డౌన్‌: చిరు బాటలో నాగ్‌

కరోనా: దూర‌ద‌ర్శ‌న్‌లో మ‌ళ్లీ షారుక్‌

‘ఫస్ట్‌ టైమ్‌ నెలకు 1000 రోజులు’

విశాల్‌ స్థానంలో శింబు..!

రామాయ‌ణ్ చూస్తున్నా.. మ‌రి మీరు?