‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’.. తమన్నా సాయం!

16 Feb, 2020 18:57 IST|Sakshi

బుల్లితెర ప్రఖ్యాత యాంకర్‌ ప్రదీప్‌ మాచిరాజు హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’.  అమృతా అయ్యర్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మున్నా దర్శకత్వం వహిస్తున్నారు. టైటిల్‌ అనౌన్స్‌మెంట్‌ నుంచి ఈ చిత్రంపై పాజిటీవ్‌ వైబ్రేషన్స్‌ నెలకొన్నాయి. ఇందుకు తగ్గట్టు చిత్ర ప్రమోషన్లు భారీ ఎత్తున ప్లాన్‌ చేస్తున్నారు చిత్ర బృందం. ఇప్పటికే మూవీ మ్యూజిక్‌ పోస్టర్‌ను రానా విడుదల చేయగా.. తొలి పాట సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాలోని రెండు లిరికల్‌ సాంగ్‌ మిల్క్‌ బ్యూటీ తమన్నా తన అధికారిక ట్విటర్‌ ద్వారా విడుదల చేశారు.  ఈ సాంగ్‌ విడుదల చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ చిత్ర యూనిట్‌కు తమన్నా బెస్ట్‌ విషెస్‌ తెలిపారు. కాగా, ఈ చిత్రం కోసం తమన్నా తన వంతు సాయాన్ని ఈ విధంగా చేసిందని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

‘ఇదేరా స్నేహం.. కనివిని ఎరుగని స్నేహం ఇది కాలం చూడని స్నేహం.. దేహం అడగని స్నేహం.. ఇది హృదయం అడిగే స్నేహం.. నింగిని నేలని వాన చినుకై కలిపెను స్నేహం. తూర్పుకు పడమరకు కాంతి తోరణమైందీ స్నేహం’అంటూ సాగే ఈ లిరికల్‌ సాంగ్‌ యూత్‌ను కట్టిపడేస్తోంది. ఈ పాటను అనూప్‌ రూబెన్స్‌ కంపోజ్‌ చేయగా.. ‘బుట్టబొమ్మ’  ఫేమ్‌ అర్మాన్‌ మాలిక్‌ ఆలపించాడు. చంద్రబోస్‌ అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు. స్నేహానికి సంబంధించి ఈ పాటలో చంద్రబోస్‌ అందించిన లిరిక్స్‌ హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్‌ ‘నీలి నీలి ఆకాశం’ ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎస్వీ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతమందిస్తున్నాడు.

 

 చదవండి:
‘ప్రదీప్‌’ పాటకు నెటిజన్లు ఫిదా
‘సామజవరగమన’ వీడియో సాంగ్‌ వచ్చేసింది!
నితిన్‌ లవ్‌స్టోరీ తెలిసింది అప్పుడే

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు