గత జన్మలో తప్పు చేస్తే...?

26 May, 2015 00:54 IST|Sakshi
గత జన్మలో తప్పు చేస్తే...?

పూర్వ జన్మలో మనుషులు చేసే తప్పుల వ ల్ల, మరుజన్మలో దారుణమైన పరిణామాలు ఎదుర్కొంటారనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘కథనం’.
 
 రంజిత్, అర్చన జంటగా స్వీయదర్శకత్వంలో సాయికిరణ్ ముక్కామల నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతనానంద్ విడుదల చేశారు.
 
 దర్శక, నిర్మాత సాయికిరణ్ మాట్లాడుతూ -‘‘ప్రతి మనిషి జీవితంలో ఓ కథ, దానికో కథనం ఉంటాయి. అదే ఈ సినిమా’’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో రంజిత్, అర్చన, నిర్మాత సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు.