పవన్‌కళ్యాణ్‌కి నేను, చరణ్ ఎంత అభిమానులమో ‘ఎవడు’ చూస్తే తెలుస్తుంది

27 Jul, 2013 04:11 IST|Sakshi
పవన్‌కళ్యాణ్‌కి నేను, చరణ్ ఎంత అభిమానులమో ‘ఎవడు’ చూస్తే తెలుస్తుంది
 ‘‘ఈ కథ చెప్పినప్పుడు ‘సూపర్బ్. ఈ సినిమా చేస్తే బాగుంటుందని చరణ్‌తో చిరంజీవి గారన్నారు. అప్పుడు నాకు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. వాస్తవానికి ‘మున్నా’ టైమ్‌లో ఆ సినిమా పాటలు విని, చాలా బాగున్నాయంటూ చరణ్ ఫోన్ చేశాడు. మా ఇద్దరి మధ్య మాటలు మొదలైంది అప్పుడే. ఆ తర్వాత ఓ కాఫీ షాఫ్‌లో కలిసిన చరణ్, ‘ ‘మున్నా’ రిజల్ట్ ఎలా ఉన్నా, ఆ సినిమా టేకింగ్ చాలా బాగుంది. ఎప్పుడన్నా మంచి కథ ఉంటే నాకు చెప్పు అన్నాడు’’ అని చెప్పారు వంశీ పైడిపల్లి.
 
  రామ్‌చరణ్, శ్రుతిహాసన్, అమీజాక్సన్ కాంబినేషన్‌లో అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ప్రత్యేక పాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎవడు’. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. ఈ రోజు వంశీ బర్త్‌డే. ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ -‘‘ఇది హైలీ కమర్షియల్ మూవీ. ఏ దర్శకుడికైనా సంతృప్తి లభించేది తనని నమ్మి డేట్స్ ఇచ్చిన హీరో, డబ్బు పెట్టిన నిర్మాత రషెస్ చూసి, ఆనందాన్ని వ్యక్తం చేసినప్పుడే. 
 
 ఇటీవల ఈ చిత్రం రషెస్ చూసి, చరణ్, రాజుగారు విజయం గ్యారంటీ అన్నారు. ఆ మాటలు నాకు ఎక్కడలేని ఎనర్జీనిచ్చాయి. ఇందులో చరణ్ నటన, డాన్స్ ఎక్స్‌ట్రార్డినరీ. ‘ఫ్రీడమ్..’ అనే పాటలో చరణ్ డాన్స్ ‘చిక్ చిక్ చేలం..’ పాటలోని చిరంజీవిగారి డాన్స్‌ని గుర్తు చేస్తుంది. ఆ పాట చేస్తున్నప్పుడే సల్మాన్ సెట్‌కొచ్చారు. ఆ పాటకు కొరియోగ్రఫీ చేసిన జానీని ముంబయ్ పిలిపించుకుని, తన హిందీ సినిమాకి అవకాశం ఇచ్చారు. బన్నీ చేసిన పాత్ర సినిమాకి ఎస్సెట్ అవుతుంది’’ అని చెప్పారు.
 
  ‘అత్తారింటికి దారేది’కి, ఈ సినిమా విడుదలకు మధ్య వారం మాత్రమే గ్యాప్ ఉండటం వసూళ్లకు ఇబ్బందనుకుంటున్నారా? అనడిగితే -‘‘నాయక్, సీతమ్మ వాకిట్లో... చిత్రాలు ఒక రోజు తేడాతో విడుదలై, విజయం సాధించాయిగా! ఇప్పుడు వారంలోనే మాగ్జిమమ్ కలక్షన్స్ వచ్చేస్తున్నాయి. కాబట్టి ప్రాబ్లమ్ లేదు. పవన్‌కళ్యాణ్‌గారికి నేను, చరణ్ ఎంత పెద్ద ఫ్యాన్సో ఈ సినిమా చూసినవారికి తెలుస్తుంది’’ అన్నారు. హాలీవుడ్ సినిమా ‘ఫేస్ ఆఫ్’కి ఈ సినిమా ప్రేరణా? అనడిగితే.. అలాంటిదేం లేదన్నారు వంశీ. తదుపరి మహేష్‌బాబుతో సినిమా చేయబోతున్నట్లు చెప్పారు.
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఫ్లాప్ హీరో కోసం నలుగురు స్టార్స్

పోలీస్‌రాజ్యంలో ఓవియ

ప్రభాస్‌... యంగ్‌ రెబల్‌స్టార్‌ కాదు!

బాషా... ఫెంటాస్టిక్‌

వాళ్లంతా ఎన్టీఆర్‌ను అవమానించినట్లే: ఆర్జీవీ

రోడ్డు ప్రమాదంలో యువ హీరోకు గాయాలు

సీనియర్‌ నటి షకీలా కన్నుమూత

'జైలవకుశ' ఎర్లీ ట్విట్టర్‌ రివ్యూ!

హిందీ సిన్మా కంటే ముందు...

నాన్నగారి ఇంటి నుంచే వచ్చా!

రంగస్థలంపై చిరు!

బిగ్‌బాస్‌: దీక్ష సంచలన వ్యాఖ్యలు

అర్ధరాత్రి లైంగికంగా వేధించారు: నటి కాంచన

బిగ్‌బాస్‌ ప్రజల్ని ఫూల్‌ చేస్తోందా?

‘రేయ్‌ మన రిసార్టులో దెయ్యం ఉందిరా..’

యాక్షన్‌ థ్రిల్లర్‌గా కింగ్స్‌మెన్‌ ది గోల్డెన్‌సర్కిల్‌

విక్రమ్ పాటకు భారీగా ‘స్కెచ్‌’

అమెరికా, జపాన్‌లతో సుష్మ చర్చలు

స్క్రీన్‌ టెస్ట్‌

ఆమె అసలు బాలయ్య కూతురేనా?

భరత్ఃఅసెంబ్లీ

మహేష్ కోసం 2 కోట్లతో భారీ సెట్..!

మహేష్ మూవీ షూటింగ్కు బ్రేక్..!

మహేష్ కెరీర్లో తొలిసారి..!

రాజకీయాలు తక్కువ.. కుటుంబమే ఎక్కువ!

త్వరలో అసెంబ్లీకి మహేష్..!

సంక్రాంతికి చిన్నోడు

కథ కోసం కోటి రూపాయలు..?

మహేష్ మూవీ టైటిల్పై దేవీ శ్రీ క్లారిటీ

సూపర్ స్టార్ ప్రమాణ స్వీకారం..?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం