నాకు మాత్రమే సంగీతం తెలుసు

5 Jan, 2019 11:06 IST|Sakshi
ఇళయరాజా

సంగీత భాణీలు కట్టడం నాకు మాత్రమే తెలుసు. ఇంకెవరికీ తెలియదు అన్నారు ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా. 75వ వసంతంలోకి అడుగుపెట్టిన ఈయనకు పలువురు సత్కార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆ విధంగా స్థానిక మెరీనా తీరంలోని రాణీ మేరీ బాలల కళాశాల నిర్వహకం  ఇళయరాజా 75 వసంతాల వేడుకను శుక్రవారం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగీతజ్ఞాని ఇళయరాజా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ మీరీ కళాశాలను ఇప్పుడే చూస్తున్నారని, తాను 48 ఏళ్లుగా చూస్తున్నానని అన్నారు. తాను సహాయ సంగీత దర్శకుడిగా ఆల్‌ ఇండియా రేడియో కార్యాలయానికి ఈ మార్గంలోనే వెళ్లేవాడినని చెప్పారు. దీనికి ఆసియాలోనే ప్రప్రథమంగా స్థాపించిన కళాశాల అనే ఖ్యాతి ఉందన్నారు. మెరినా తీరం ఎదురుగా నెలకొల్పడం ఈ కళాశాల ప్రత్యేకత అని పేర్కొన్నారు. తాను అన్నక్కిళి చిత్రానికి తొలి భాణీలు కట్టింది మెరీనా తీరంలోనేనని తెలిపారు.

పరిస్థితులకు తగ్గ సంగీతం
చిత్రంలోని ఇప్పుడు పరిస్థితులకు తగ్గట్టు సంగీత భాణీలు కట్టేవారు తాను మినహా ఎవరూ లేరని ఇళయరాజా అన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఇళయరాజా బదులిస్తూ తాను కళాశాల చదువులు చదవకపోవడం వల్ల ఎలాంటి చింతా లేదన్నారు. అయితే కళాశాల చదువు అనుభవం మాత్రం తనకు చాలా ఉందన్నారు. 1968 మార్చి నెలలో చెన్నైకి వచ్చినప్పుడు తన వద్ద ఏమీ లేదని, నమ్మకం మాత్రమే ఉందని ఇళయరాజా పేర్కొన్నారు. ముందుగా ఇళయరాజా తాను భాణీలు కట్టిన పాటలను విద్యార్థులకు పాడి వినిపించారు. 

మరిన్ని వార్తలు