బాలీవుడ్ కు యువన్ శంకర్ రాజా!

1 Jul, 2013 21:15 IST|Sakshi
బాలీవుడ్ కు యువన్ శంకర్ రాజా!
దక్షిణాదిలో తనదైన శైలిలో సంగీతాన్ని అందిస్తూ తనదైన ప్రత్యేకతను చాటుకున్న ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా బాలీవుడ్ లో ఎంట్రీకి సిద్ధమయ్యాడు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ నటించే తదుపరి చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చనున్నారు. 
 
యూనివర్సల్ అప్పీల్ ఉన్న సంగీత దర్శకులు ఏఆర్ రెహ్మాన్ మాదిరిగానే  తమిళ చిత్రాలతోపాటు, దక్షిణాదిచిత్రాల్లో తానేంటో నిరూపించుకుని బాలీవుడ్ లో ప్రవేశిస్తున్నారని, ఆతర్వాత హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తారని యూటీవీ డిస్నీస్టూడియోస్ క్రియేటివ్ డైరెక్టర్ మనీష్ హరిప్రసాద్ అన్నారు. 
 
ఇప్పటికే వందకు పైగా చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన యువన్ శంకర్ రాజా డిస్నీ యూటీవీ ద్వారా బాలీవుడ్ కు పరిచయం తమ అదృష్టమని మనీష్ అన్నారు. రానున్న కాలంలో బాలీవుడ్ లో మరిన్ని చిత్రాలకు మంచి సంగీతాన్ని అందిస్తారని ఆశిద్దామని ఓ ప్రకటనలో మనీష్ వెల్లడించారు.