ఇలా చేస్తే అన్నీ మాయం! 

17 Jul, 2020 06:35 IST|Sakshi

ఇలా చేయండి బాధలు, భయాలు అన్ని మటుమాయమవుతాయి అని చెప్పుకొచ్చింది నటి ఇలియానా. ఇంతకుముందు తెలుగు చిత్ర పరిశ్రమలో కథానాయికగా ఓహో అంటూ వెలిగిపోయిన విషయం తెలిసిందే. కాగా తమిళంలో ఆదిలోనే  కేడీ చిత్రం ద్వారా పరిచయమైన ఈ అమ్మడిని ఇక్కడ ఎవరు పట్టించుకోలేదు. దీంతో తెలుగు చిత్రాలకే పరిమితమైపోయింది. అలాంటిది చాలా కాలం తర్వాత నటుడు విజయ్‌కు జంటగా. శంకర్‌ దర్శత్వంలో నంబన్‌ చిత్రంతో కోలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చింది. అంతే ఆ చిత్రం తర్వాత మళ్లీ ఇక్కడ కనిపించలేదు. అలాగని తెలుగు చిత్రాలను కాదనుకుని బాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. అయితే అక్కడ ఆశించిన ఆదరణ లభించలేదు. ప్రస్తుతం దక్షిణాదిలో అవకాశాల ప్రయత్నాల్లో ఉంది.

కాగా ఈ కరోనా కాలంలో అందరూ నటీమణుల మాదిరిగానే ఇలియానా కూడా మీడియాతో భేటీలు అభిమానంతో ముచ్చట్లు అంటూ కాలం గడుపుతోంది. అదేవిధంగా ఇంట్లోనే ఉంటూ వ్యాయామాలు వంటి కసరత్తులు చేస్తూ అందాలను పదిల పరుచుకుంటోంది. అలా ఇటీవల ఇలియానా ఒక భేటీలో పేర్కొంటూ కొన్ని సమయాల్లో మనసు తట్టుకోలేనంత బాధ, భయం కలుగుతాయి అని చెప్పింది. అలాంటి సమయాల్లో తాను వ్యాయామాలు చేస్తానని చెప్పింది. అప్పుడు భయం, బాధలు అన్ని మటుమాయం అయిపోతాయి అని చెప్పింది. కాబట్టి అందరూ ఈ సూత్రాన్ని పాటించండి అని పేర్కొంది. వ్యాయామం చేస్తున్నప్పుడు లక్ష్యాన్ని చేరుకుంటున్న భావన కలుగుతుందని చెప్పింది. ( నాలో మంచి కుక్‌ ఉందని తెలుసుకున్నా! )

ఆ మధ్య కాస్త బరువు పెరిగానని దీంతో కొందరు రకరకాలుగా విమర్శలు చేశారని తెలిపింది. దీంతో తీవ్రంగా కసరత్తులు చేసి ఇప్పుడు మళ్లీ స్లిమ్‌గా యథాస్థితికి మారినట్లు  తెలిపింది. తాను నిత్యం వ్యాయామం చేస్తారని తెలిపింది. ఆన్‌లైన్లో చూసి రకరకాల వ్యాయామాలు చేస్తానని చెప్పింది. ఇంత సమయం అని పరిమితులు ఉండదని ఒకసారి 75 నిమిషాలు చేస్తే, మరోసారి రెండు గంటల వరకు చేస్తారని చెప్పింది. ఇలా అందరూ వ్యాయామం చేసి అందరూ మంచి ఆరోగ్యంతోపాటు శరీరాన్ని బలంగా ఉంచుకోవాలని ఇలియానా సలహా ఇచ్చింది. ఒక్కసారి వ్యాయామం చేసి చూడండి దాని ఫలితం మీకే అర్థం అవుతుంది అని ఈ బ్యూటీ పేర్కొంది.    

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు