‘అత్యంత ప్రమాదకర సెలబ్రిటీ ఇలియానా’

7 Oct, 2018 12:04 IST|Sakshi

అభిమాన తారలకు సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఫ్యాన్స్‌ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్‌ మీడియాలో తారలను ఫాలో అవ్వటంతో పాటు వారికి సంబంధించిన వార్తలకు తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌ లో సెర్చ్ చేస్తుంటారు. అయితే అలా సెర్చ్‌ చేసే సమయంలో కొం‍త మంది తారల గురించి వెతకటం ప్రమాదకరమంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌. పాపులర్‌ సెలబ్రిటీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు డౌన్‌లోడ్‌ చేసే సమయంలో మీ కంప్యూటర్‌లలోకి వైరస్‌లను ప్రవేశ పెట్టే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ప్రముఖ ఇంటర్‌నెట్‌ సెక్యూరిటీ సంస్థ మెకాఫీ మోస్ట్ డేంజరస్‌ సెలబ్రిటీల లిస్ట్‌ను విడుదల చేసింది. ఈ లిస్ట్‌లో గోవా బ్యూటీ ఇలియానా టాప్‌ ప్లేస్‌లో ఉన్నారు. ఇలియానా తరువాతి స్థానాల్లో ప్రీతీ జింటా, టబు, క్రితీ సనన్‌, అక్షయ్‌ కుమార్‌, దీపికా పదుకొనే లాంటి వారు ఉన్నారు. అయితే టాప్‌ సెలబ్రిటీలను పక్కన పెట్టి పెద్దగా సినిమా అవకాశాలు లేని ఇలియానా మెస్ట్ డేంజరస్‌ సెలబ్రిటీల లిస్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉండటం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ భామ రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న అమర్‌ అక్బర్‌ ఆంటొని సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా