బ్రేకప్‌ గురించి మాట్లాడను

19 Nov, 2019 06:02 IST|Sakshi

‘‘యాక్టర్స్‌ జీవితాల్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకులకు కచ్చితంగా ఉంటుంది. నా గురించి ఏదైనా చెప్పగలను. కానీ, నా రిలేషన్‌షిప్‌ గురించి ఏం మాట్లాడలేను. రిలేషన్‌షిప్‌ అంటే నేను మాత్రమే కాదు.. నాతో పాటు ఇంకొకరు ఉంటారు. వాళ్ల గురించి నేను మాట్లాడలేను’’ అన్నారు ఇలియానా. ఆస్ట్రేలియన్‌ ఫొటోగ్రాఫర్‌ ఆండ్రూ నీబోన్‌తో ఇలియానా కొన్నాళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇటీవల వీళ్లిద్దరూ రిలేషన్‌షిప్‌కు ఫుల్‌స్టాప్‌ పెట్టారు. అయితే ఈ బ్రేకప్‌ గురించి ఇలియానా ఎక్కడా మాట్లాడలేదు.

ఈ విషయం గురించి తాజాగా ఆమె స్పందిస్తూ– ‘‘రిలేషన్‌షిప్‌ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన విషయం. దాని గురించి మనం ఏం మాట్లాడినా అది వాళ్ల గురించి కూడా మాట్లాడినట్టే. అది వాళ్ల్ల ప్రైవసీని (గోప్యత) గౌరవించనట్టే. రిలేషన్‌షిప్‌కి సంబంధించిన విషయాలు సరిగ్గా వ్యక్తపరచకపోయినా, ఆ టాపిక్‌లోని కొన్ని వ్యాఖ్యలు తీసుకొని హైలెట్‌ చే సినా వేరేవాళ్ల ప్రైవసీని ఇబ్బందుల్లో పెట్టినట్టే. వారి ప్రైవసీని గౌరవిస్తాను. నేను  విమర్శలు తీసుకుంటున్నాను. వాళ్లను కూడా దీనికి బాధితులను చేయలేను. అందుకే నా రిలేషన్‌షిప్‌ గురించి మాట్లాడాలనుకోవడం లేదు’’ అన్నారు.

మరిన్ని వార్తలు