'మీరు ఇలాగే చేస్తే ట్విట్టర్ వదిలేస్తా'

10 Jun, 2015 15:25 IST|Sakshi
'మీరు ఇలాగే చేస్తే ట్విట్టర్ వదిలేస్తా'

ముంబయి: ట్విట్టర్స్లో తన ఫాలోవర్స్, అభిమానులపై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిరు కోపం వెళ్లబుచ్చారు. వారి ప్రవర్తనపై తనకు కూసింత అసహనంగా ఉందని చెప్పారు. అలాగే చేస్తే ట్విట్టర్ ను వదిలేస్తారని చెప్పారు. ఇంతకీ సల్మాన్ కు అసలు కోపం ఎందుకొచ్చిందని అనుకుంటున్నారా.. మరేం లేదు మరో అగ్ర హీరోలు షారుఖ్ ఖాన్, అమిర్ ఖాన్ కు వ్యతిరేకంగా సల్మాన్ అభిమానులు పోస్టింగ్ లు చేస్తున్నారట. అది వారిని ఇబ్బంది పెట్టేలా ఉండటంతో అలా చేయకూడదని ఇదివరకే చెప్పిన సల్మాన్ చివరికి అభిమానుల తీరు మారకపోవడంతో కోపగించుకున్నారు.

తాము ముగ్గురం మంచి స్నేహితులమని, ఇండస్ట్రీలో నెంబర్ గేమ్ ఉండదని చెప్పారు. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో నటిస్తూ ఒకరికొకరం హీరోలుగా వెలుగొందుతున్నాం. అందరికీ ప్రేమను స్నేహాన్ని పంచాలనే ఉద్దేశంతోనే ట్విట్టర్ లోకి వచ్చాను. కానీ, డై హార్డ్ ఫ్యాన్స్ వల్ల ఇబ్బంది కలుగుతోంది. ఇంకోసారి వారిలాగే చేస్తే కచ్చితంగా ట్విట్టర్ ను వదిలేస్తాను' అని ఆయన చెప్పారు. సల్మాన్ ఖాన్ కు ట్విట్టర్లో దాదాపు 12.3 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా