మోహన్‌లాలే కారణమంటున్న కమల్!

10 Jul, 2015 23:45 IST|Sakshi
మోహన్‌లాలే కారణమంటున్న కమల్!

ఓ చిన్న కథ. కూతురు అనుకోకుండా ఓ  ఆపదలో పడితే, తండ్రి తన కూతురినే కాక మొత్తం కుటుంబాన్ని కాపాడుకుంటాడు. అది ఎలా అన్నది ఇప్పటికి నాలుగు భాషల్లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ సినిమా కథ ‘దృశ్యం’ అని. ఎక్కడో మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు హాట్ కేక్. ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో వెంకటేశ్ హీరోగా నటించి ఓ మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. కమల్‌హాసన్ ‘పాపనాశమ్’ పేరుతో తాజాగా తమిళంలో చేసి విజయం సాధించారు.కానీ ఆయన లాంటి పెద్ద నటుడు ఇంత సామాన్యమైన కథను చేయడానికి పరోక్ష కారణం మాత్రం మోహన్‌లాల్.

ఆయన ఈ సినిమాను తమిళంలో కమల్‌హాసనే చేయాలని కోరుకున్నారు. ఆ సంగతి తెలిసిన కమల్, ‘‘‘దృశ్యం’ రీమేక్‌లో ప్రధాన పాత్ర నేను చేస్తే బాగుంటుందని మోహన్‌లాల్ అన్నారట. ఇంత మంచి కథకు నా పేరు సూచించినందుకు ఆయనకు థ్యాంక్స్. ఈ సినిమా ఎవరైనా వేసుకోవాలనుకునే మంచి చొక్కా లాంటిది’’ అన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి