ఎవరితోనైనా రొమాన్స్‌కు రెడీ

10 Jan, 2014 23:50 IST|Sakshi
ఎవరితోనైనా రొమాన్స్‌కు రెడీ

 బాలీవుడ్‌లో తెరపై రొమాన్స్ పండించడంలో కొన్ని జంటలకే ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.  అలా తెరమీద కెమిస్ట్రీని పండించడంలో కొన్ని జంటలు తమకంటూ ఓ మార్క్‌ని క్రియేట్ చేసుకున్నాయి. తెరపై హాట్ హాట్‌గా కనిపించి..ప్రేక్షకులను ఆక ట్టుకున్న జంటల్లో రాజ్ కపూర్-నర్గీస్, అమితాబ్-రేఖ, రాజేశ్ ఖన్నా-డింపుల్ కపాడియాలు ప్రత్యేకంగా నిలుస్తారు. అయితే ఇటీవల కాలంలో బాలీవుడ్‌లో షారుక్-కాజోల్ జంటకు లభించినంత క్రేజ్ మరెవరికీ దక్కలేదు. బాలీవుడ్ చిత్రాలకు కాజోల్ దూరమైన తర్వాత ప్రస్తుతం ప్రియాంకా చోప్రా-షారుక్‌ల జోడి తెరపై హడావిడి చేస్తోంది. వీరిద్దరూ ‘డాన్’, ‘డాన్-2’ చిత్రాల్లో ప్రేక్షకులకు కనువిందు చేశారు.
 
  అయితే ఇటీవల మీడియా సమావేశంలో షారుక్‌తో ’రొమాన్స్’ విషయాన్ని ప్రస్తావిస్తే.. ‘‘అలాంటిదేమీ లేదు.. నేను ఎవరితోనైనా రొమాన్స్ చేయగలను’’ అని ప్రియాంక వ్యాఖ్యానించారు. కేవలం షారుక్‌తోనే కాకుండా... హృతిక్ రోషన్, రణబీర్ కపూర్, ఇతర కుర్ర హీరోలతోనూ రొమాన్స్ చేశానని చెప్పుకొచ్చారు. ఫలానా హీరోతోనే రొమాన్స్‌కు సూట్ అవుతానని ఓ బ్రాండ్ వేసుకోవడం తనకు ఇష్టం లేదని ప్రియాంక తెలిపారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి