జోరుగా కలెక్షన్ల 'తమాషా'!

29 Nov, 2015 17:52 IST|Sakshi
జోరుగా కలెక్షన్ల 'తమాషా'!

ముంబై: బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల 'తమాషా' జోరుగానే కొనసాగుతున్నది. రణ్‌బీర్ కపూర్, దీపికా పదుకొణే జంటగా తీసిన 'తమాషా' చిత్రం దేశంలో తొలిరోజే రూ. 10.87 కోట్లు వసూలు చేసింది. రణ్‌బీర్ కపూర్ కెరీర్‌లో తొలిరోజు అత్యధిక కలెక్షన్‌ ఇదే. ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలైంది.

'తమాషా'లో రణ్‌బీర్, దీపికా అభినయానికి మంచి మార్కులే పడుతున్నాయి. దీనికి తోడు ప్రేక్షకుల 'మౌత్‌ పబ్లిసిటీ' కూడా సినిమాకు బాగా కలిసి వస్తున్నది చిత్రబృందం ఓ ప్రకటనలో తెలిపింది. గత శుక్రవారం భారీ సినిమాలు ఏవీ  విడుదల కాకపోవడం 'తమాషా'కు కలిసి వచ్చింది. పెద్ద సినిమాలు ఏవీ ప్రస్తుతం బరిలో లేకపోవడంతో మొదటి వారాంతంలో భారీగా వసూళ్లు ఉంటాయని చిత్రబృందం ఆశిస్తున్నది. యూటీవీ మోషన్ పిక్చర్స్, నదియావాలా గ్రాండ్‌సన్‌ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్త సమర్పణలో సాజిద్ నదియావాలా ఈ సినిమాను రూపొందించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి