సంక్రాంతి పండుగ వేళ రష్మికకు గట్టిషాక్‌

16 Jan, 2020 11:35 IST|Sakshi

సంక్రాంతి పండగవేళ టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ రష్మికా మందన్నకు గట్టి షాక్‌ తగిలింది. కర్ణాటకలోని కూర్గ్‌లోని రష్మిక నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. గత ఏడాది కాలంగా టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగుతోన్న రష్మికా.. ఇటీవలే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో నటించింది. బోలెడు హిట్లు, చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ఆదాయ లెక్కలను ఐటీ అధికారులు పరిశీస్తున్నారు. 

కన్నడలో కిరాక్‌ పార్టీతో కెరీర్‌ ప్రారంభించిన రష్మిక, తెలుగులో ఛలో సినిమాతో హిట్‌ ట్రాక్‌ మొదలెట్టింది. ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం రష్మికా కెరియర్‌ను ఓ స్థాయికి తీసుకెళ్లింది. తెలుగులో కెరియర్‌ తారాస్థాయిలో ఉండడంతో ఎంగేజ్‌మెంట్‌ను కూడా క్యాన్సల్‌ చేసుకుని టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తోంది రష్మికా. డియర్‌ కామ్రెడ్‌, దేవదాసు కూడా ఓ స్థాయిలో నడవగా.. తాజాగా మహేష్‌బాబుతో సరిలేరు నీకెవ్వరు చేసింది రష్మికా. స్టార్‌ హీరోలతో చేతిలో మరిన్ని సినిమాలున్న రష్మికా బోలెడు ఆదాయం సంపాదిస్తుందన్నది ఐటీ వర్గాల అంచనా.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఉప్పెన’ నుంచి న్యూలుక్‌ విడుదల

నెటిజన్ల ట్రోల్స్‌పై స్పందించిన సోనాక్షి

హలో! ఇప్పుడే క్లారిటీకి రాకండి

కరోనా: మరో ప్రముఖ నటుడు మృతి 

అమలాపాల్‌ రెండో పెళ్లిపై స్పందించిన శ్రీరెడ్డి

సినిమా

‘ఉప్పెన’ నుంచి న్యూలుక్‌ విడుదల

నెటిజన్ల ట్రోల్స్‌పై స్పందించిన సోనాక్షి

హలో! ఇప్పుడే క్లారిటీకి రాకండి

కరోనా: మరో ప్రముఖ నటుడు మృతి 

అమలాపాల్‌ రెండో పెళ్లిపై స్పందించిన శ్రీరెడ్డి

ఇటలీలో మన గాయని