'గబ్బర్ సింగ్' దర్శకుడికి చేదు అనుభవం!

2 Feb, 2017 13:31 IST|Sakshi
'గబ్బర్ సింగ్' దర్శకుడికి చేదు అనుభవం!

హైదరాబాద్: 'గబ్బర్ సింగ్' దర్శకుడు హరీశ్ శంకర్ కు చేదు అనుభవం ఎదురైంది. గురువారం డైరెక్టర్ హరీశ్ శంకర్, మరికొందరు మిత్రులతో కలిసి శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకి వెళ్లారు. అయితే కాస్త ఆలస్యం అయిందన్న కారణంగా ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది వారిని విమానంలోకి అనుమతించలేదని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

రెగ్యూలర్ గా ఇండిగో ఎయిర్ లైన్స్ విమానాలు మాత్రం ఆలస్యమవుతాయని పేర్కొన్న డైరెక్టర్.. ప్యాసింజర్స్ మాత్రం కాస్త ఆలస్యంగా వస్తే అనమతించడం లేదని ట్వీట్లో రాసుకొచ్చారు. ఇందుకు సంబంధించి ఓ తన ట్వీట్ లో ఇండిగో విమానం లేటయిన సమాచారం ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.