ప్రభాస్ 'సాహో'పై ఇంట్రస్టింగ్ అప్డేట్

9 Sep, 2017 15:09 IST|Sakshi
ప్రభాస్ 'సాహో'పై ఇంట్రస్టింగ్ అప్డేట్

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసింది. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్ తో భారీ తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్  హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రభాస్ తో పాటు హీరోయిన్ శ్రద్ధా కూడా షూటింగ్ లో పాల్గొంటుంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో శ్రద్ధా ద్విపాత్రాభినయం చేస్తుందట. ఈ రెండు పాత్రల్లో ఒకటి నెగెటివ్ రోల్ అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బాలీవుడ్ హాట్ బ్యూటీ మందిరా బేడి ఈ సినిమాలో నెగెటివ్ రోల్ చేస్తుండగా ఇప్పుడు శ్రద్ధా కూడా విలన్ గా అలరించనుందన్న ప్రచారం జరుగుతోంది.