సాయంత్రం నుంచి ఉదయం వరకూ..

17 Feb, 2018 04:30 IST|Sakshi
సౌమ్యవేణుగోపాల్, నందు

నందు, సౌమ్యవేణుగోపాల్, పూజ రామచంద్రన్‌ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘ఇంతలో ఎన్నెన్ని వింతలో’. వరప్రసాద్‌ వరికూటి దర్శకత్వంలో హరహర చలనచిత్ర సమర్పణలో ఎస్‌. శ్రీకాంత్‌ రెడ్డి, రామ్మోహన్‌రావు ఇప్పిలి నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. నందు మాట్లాడుతూ– ‘‘ఈ రోజు సాయంకాలం మొదలై రేపు ఉదయం వరకు ఏం జరుగుతుందనేదే ఈ సినిమా కథ. నా గత సినిమాల కంటే ఈ చిత్రవిజయంపై ఎక్కువ నమ్మకంగా ఉన్నా. ఈ సినిమాలో నాతో పాటు నటించిన ముగ్గురు కూడా హీరోలే. మార్చి నుంచి థియేటర్స్‌ బంద్‌ అంటున్నారు. అది లేకుంటే మార్చి 2న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమిది.  రషెస్‌ చూసినవాళ్లు ప్రశంసించారు. విడుదలకు రెండు రోజుల ముందే ప్రెస్‌ వారికి ప్రివ్యూ వేయాలనుకుంటున్నామంటే ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నామో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు దర్శక–నిర్మాతలు. మంచి చిత్రంలో నటించామని సౌమ్యవేణుగోపాల్, పూజరామచంద్రన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు