నాకు అమ్మాయి దొరికింది : సల్మాన్‌

6 Feb, 2018 12:30 IST|Sakshi
సల్మాన్‌ ఖాన్

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ ఓ ఆసక్తికర మైన ట్వీట్‌ తో అభిమానులకు షాక్ ఇచ్చాడు. 50 ఏళ్లుదాటినా మోస్ట్ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌గా ఉన్న సల్మాన్‌.. తనకు అమ్మాయి దొరికిందంటూ ట్వీట్ చేశాడు. అయితే సల్మాన్ చేసిన ఈ ట్వీట్ తన పెళ్లికి సంబంధించినదేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొంత కాలంగా లులియా వాంటూర్‌ తో సన్నిహితంగా ఉంటున్న సల్మాన్ ఇటీవల ఆమెకు దూరమైనట్టుగా వార్తలు వినిపించాయి. లులియా కూడా సల్మాన్‌ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అంటూ కామెంట్ చేయటంతో వారిద్దరు దూరమయ్యారని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్‌. ఇప్పుడు సల్మాన్‌ ట్వీట్ తో మరోసారి సల్మాన్‌ పెళ్లి వార్త హాట్‌ టాపిక్‌గా మారింది. ఇటీవల టైగర్‌ జిందాహై సినిమాతో ఘనవిజయం సాదించిన సల్లూభాయ్ ప్రస్తుతం రేస్‌ 3 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. రెమో డిసౌజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌, డైసీ షాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

మరిన్ని వార్తలు