వారి మనసు దోచడానికి గ్లామర్‌ అవసరం

12 Jan, 2020 07:30 IST|Sakshi
మాళవికమోహన్‌

నేనూ అమ్మాయినేగా అంటోంది నటి మాళవికామోహన్‌. ఈ కేరళా కుట్టి ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్‌ నటిగా మారింది. ముంబయిలో చదివిన ఈ చిన్నది మాతృభాష మలమాళంలో తొలిసారిగా 2013లో కథానాయకిగా పరిచయమైంది. పట్టం పోల్‌ అనే చిత్రంలో దుల్కర్‌సల్మాన్‌కు జంటగా నటించింది. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఆపైన వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ రావడం మొదలెట్టాయి. అయితే నటిగా ఎంట్రీ ఇచ్చి ఏడేళ్లు అయినా ఇప్పటికి ఏడు చిత్రాలే చేయడం విశేషం. వీటిలో మూడు మలయాళం, ఒక కన్నడం, రెండు తమిళం, ఒక హిందీ చిత్రం ఉన్నాయి. అంటే అప్పుడే దక్షిణాదితో పాటు ఉత్తరాదికి ఎంట్రీ ఇచ్చేసిందన్న మాట. అంతే కాదు త్వరలో తెలుగులోనూ పరిచయం కానుంది. హిందీలో మజీద్‌ మజీద్‌ అనే చిత్రంతో పరిచయమైంది.

చదవండి: వివాదాల 'దర్బార్‌'

అలా తమిళంలో గత ఏడాది పేట చిత్రంతో దిగుమతి అయ్యింది. అందులో శశికుమార్‌ భార్యగా చిత్రానికి కీలక పాత్రలో నటించి గుర్తింపు పొందింది. అంతే ఇప్పుడు దళపతి విజయ్‌తో నటించే లక్కీఛాన్స్‌ను దక్కించుకుంది. దీనికి మాస్టర్‌ అనే టైటిల్‌ను నిర్ణయించారు. లోకేష్‌ కనకరాజ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. సమ్మర్‌ స్పెషల్‌గా తెరపైకి రావడానికి మాస్టర్‌ రెడీ అవుతున్నారు. కాగా నటి మాళవిక మోహన్‌ కోలీవుడ్‌లో తన క్రేజ్‌ను పెంచుకునే పనిలో పడింది. దీంతో తరచూ ఫొటో సెషన్‌ చేయించుకుని ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తోంది. ఆ ఫొటోలు చాలా గ్లామరస్‌గా ఉండడంతో నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీని గురించి మాళవికమోహన్‌ స్పందిస్తూ ఫొటోలను తీయించుకోవడానికి నటీమణులు చాలా ఇష్టపడతారంది.

చదవండి: త్రిష పరమపదంకు టైమ్‌ వచ్చింది

ఇక అమ్మాయిలకు ఇంకా ఇష్టం అంది. నటినైనా తానూ అమ్మాయినే కదా అని అంది. సినిమాలతో బిజీగా ఉన్నా ప్రత్యేకంగా ఫొటోలు తీసుకోవడంలో తనకు చాలా ఆసక్తి అని పేర్కొంది. ఇక అలాంటి ఫొటోలను థ్రిల్లింగ్‌గా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తుంటానని మాళవిక మోహన్‌ చెప్పుకొచ్చింది. ఇక గ్లామర్‌ అంటారా ఈ తరం యువత గ్లామర్‌నే కోరుకుంటారని, అలా వారి మనసును దోచుకోవడానికి ఆ మాత్రం గ్లామర్‌ అవసరం అని చెప్పింది. కాగా ప్రస్తుతం మాస్టర్‌ చిత్రానే నమ్ముకున్న ఈ బ్యూటీ ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుందట. కాగా తెలుగులో విజయ్‌దేవరకొండకు జంటగా హీరో చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం జరిగింది. మరి ఆ చిత్రం ఏమైందన్నది తెలియాల్సి ఉంది. మొత్తం మీద ఇప్పుడు మాళవికమోహన్‌ టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారింది. మాస్టర్‌ చిత్రం విడుదల తరువాత ఈ అమ్మడి లెవల్‌ ఏ స్థా«యికి చేరుకుంటుందో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా