అఖిల్ నిశ్చితార్థ వేడుక ఆహ్వానం

1 Nov, 2016 23:31 IST|Sakshi
అఖిల్ నిశ్చితార్థ వేడుక ఆహ్వానం

‘శ్రీమతి అన్నపూర్ణ మరియు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు ఆశీర్వాదాలతో... మా అబ్బాయి అఖిల్ నిశ్చితార్థ వేడుకకు మిమ్మల్ని అమితానందంతో ఆహ్వానిస్తున్నాం’ - ఇట్లు అమల అండ్ అక్కినేని నాగార్జున. సినీ ప్రముఖులకూ, సన్నిహితులకూ అక్కినేని కుటుంబం నుంచి అందిన ఆహ్వానం ఇది. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే మనవరాలు, సోమనాద్రి భూపాల్, షాలినీ దంపతుల కుమార్తె శ్రీయా భూపాల్, అఖిల్‌ల ప్రేమను ఇరు కుటుంబ సభ్యులూ అంగీకరించిన సంగతి తెలిసిందే.

డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం 7 గంటలకు జీవీకే ఇంట్లో నిశ్చితార్థం జరగనుంది. వచ్చే ఏడాది పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటలీ రాజధాని రోమ్‌లో పెళ్లి చేయాలనుకుం టున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. డెస్టినేషన్ వెడ్డింగ్‌కి ప్లాన్ చేస్తున్నట్టు ఫిల్మ్‌నగర్ టాక్