ఆమిర్‌ కూతురు డైరెక్షన్‌లో...

24 Aug, 2019 05:50 IST|Sakshi

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోషూట్‌ ఫొటోలతో తరచూ వార్తల్లో ఉంటుంటారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ కూతురు ఐరా ఖాన్‌. ఈ స్టార్‌ కిడ్‌ త్వరలో నటిగా కెమెరా ముందుకు రాబోతుందన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఐరా డైరెక్షన్‌ దిశగా అడుగులు వేస్తున్నట్లున్నారు. ఇంత చిన్న వయసులో డైరెక్షన్‌ వంటి పెద్ద బాధ్యతను ఐరాకు అప్పజెప్పింది ఎవరా? అనే ఆలోచన చేయవద్దు. ఎందుకుంటే ఐరా డైరెక్ట్‌ చేయబోయేది ఫీచర్‌ ఫిల్మ్‌ని కాదు.

ఓ నాటకానికి దర్శకత్వ బాధ్యతలు చేపట్టబోతున్నారు. గ్రీక్‌ ట్రాజిడీ డ్రామా ‘మేడియా’ను డైరెక్ట్‌ చేయబోతున్నారు ఐరా. ‘‘ఒరిజినల్‌ 431 బీసీ కాలానికి చెందినది. నా ప్రజెంటెషన్‌లో కొన్ని మార్పులు ఉంటాయని చెప్పగలను. ఏమో భవిష్యత్‌లో సినిమాను కూడా డైరెక్ట్‌ చేస్తానేమో ఇప్పుడే చెప్పలేను’’ అని ఐరా ఖాన్‌ చెప్పుకొచ్చారు. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఈ డ్రామా ప్రీమియర్‌ను డిసెంబర్‌లో ప్రదర్శించాలని ప్లాన్‌ చేస్తున్నారట.

మరిన్ని వార్తలు