నా భార్య కోసం బతకాలనుకుంటున్నాను: నటుడు

3 Mar, 2020 16:08 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ గత రెండు సంవత్సరాలుగా క్యాన్సర్‌ వ్యాధితో పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. క్యాన్సర్‌ మహమ్మారి నుంచి బయట పడేందుకు కొన్నాళ్లపాటు లండన్‌లో చికిత్స కూడా తీసుకున్నాడు. ఇక ఇప్పుడే ఇర్ఫాన్‌ క్యాన్సర్‌ నుంచి కోలుకుంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఓ మీడియాతో మాట్లాడుతూ.. క్యాన్సర్‌ వ్యాధి గురించి, తన కుటుంబం గురించి చెప్పుకొచ్చారు. కష్ట సమయంలో ఉన్నప్పుడు తన భార్య సుతప, ఇద్దరు కొడుకులు తనకు ఎంతోగానో అండగా నిలిచారని పేర్కొన్నారు. మళ్లీ మాములు మనిషిని కావడంలో కుటుంబం పాత్ర అమితంగా ఉందన్నారు. (క్యాన్సర్‌ కదా.. అందుకే: ఇర్ఫాన్‌ ఖాన్‌ భావోద్వేగం!)

‘‘జీవితం అనేది రోలర్‌ క్యాస్టర్‌ రైడ్‌ వంటిది. మధురమైన అనుభూతులతోపాటు చేదు అనుభవాలు కూడా ఉంటాయి. సంతోషకరమైన క్షణాలను మాత్రమే గుర్తుంచుకోవాలి. మేము కొన్ని బాధలను అనుభవించాం.. అంతకంటే ఎక్కువ ఆనందంగా గడిపాం. నేను విపరీతమైన ఆందోళనకు గురయ్యాను.. కానీ దానిని ప్రస్తుతం నియంత్రించగలిగాను. నా కొడుకులతో గొప్ప సమయం గడిపాను’’. అని చెప్పుకొచ్చారు. అలాగే భార్య గురించి అడగ్గా.. ‘నేను జీవించాలి అనుకుంటే కేవలం నా భార్య కోసం జీవించాలనుకుంటున్నాను. నేను ఇంకా బతికి ఉండటానికి ఆమె కారణం’ అని పేర్కొన్నారు. (వీల్‌చైర్‌లో నటుడు.. ముఖం దాచుకొని..!)

ఇక సినిమాల విషయానికొస్తే ఇర్ఫాన్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆంగ్రేజీ మీడియం’. హోమీ అదజానియా దర్శకత్వంతో రూపొందుతున్న ఈ  సినిమాను దినేశ్‌ విజాన్తో కలిసి జియో స్టూడియోస్‌ నిర్మిస్తోంది. కరీనా కపూర్‌, రాధినా మదన్‌, డింపుల్‌ కపాడియా, కికూ శారద, రణ్‌వీర్‌ షోరే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌ లుక్‌, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సినిమాను మార్చి 20 న విడుదల చేయనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా