సామాన్యుడు తిరగబడితే..!

12 May, 2016 13:58 IST|Sakshi
సామాన్యుడు తిరగబడితే..!

ఇన్నాళ్లు రొటీన్ మాస్ సినిమాలతో బోర్ కొట్టించిన బాలీవుడ్, ఇప్పుడు ఇంట్రస్టింగ్ కాన్సెప్టులతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఎక్కువగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో అలరిస్తున్నాయి. నటీనటులు కూడా తమని తాము ప్రూవ్ చేసుకోవడానికి ఈ తరహా సినిమాలే కరెక్ట్ అని భావిస్తున్నారు. ఛాలెంజింగ్ రోల్స్లో ఆకట్టుకుంటున్నారు. అదే బాటలో రిలీజ్కు రెడీ అవుతున్న బాలీవుడ్ డ్రామా ఫిలిం మదారి.

ప్రస్తుత రాజకీయ శక్తుల కారణంగా తన కొడుకును కోల్పోయిన ఓ సామాన్యుడు వ్యవస్థ మీద ఎలా పగతీర్చుకున్నాడన్న కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరోసారి తనదైన నటనతో అలరించడానికి రెడీ అవుతున్నాడు. నిశికాంత్ కామత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ను బుధవారం విడుదల చేశారు. థ్రిల్లింగ్గా రూపొందిన ఈ ట్రైలర్, సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలను కూడా ఆకట్టుకుంటోంది.