నా భర్త నాతోనే ఉన్నాడు: ఇర్ఫాన్‌ భార్య

30 Apr, 2020 19:25 IST|Sakshi

బాలీవుడ్‌ లెజెండరి నటుడు ఇర్ఫాన్‌ ఖాన్‌ క్యాన్సర్‌తో బుధవారం తుది శ్వాస విడిచారు. కాగా ఆయన భార్య సుతప సిక్దర్‌ సోషల్‌ మీడియాలో తన భర్తతో దిగిన ఫొటోను గురువారం షేర్‌ చేస్తూ.. భావోద్యేగానికి లోనయ్యారు. అంతేకాదు సోషల్‌ మీడియాలోని తన ఖాతాలన్నింటికీ ప్రొఫైల్‌ ఫొటోగా పెట్టుకున్న ఈ ఫొటోలో సుతప తన భర్త ఇర్ఫాన్‌ పక్కనే కూర్చుని ఆయన భుజాన్ని తన చేతులతో చుట్టేసుకుని కనిపిస్తుంది. (ఉద్వేగానికి లోనైన ఇర్ఫాన్‌ కుమారుడు)

తన భర్త లోకాన్ని విడిచినప్పటికీ తనతోనే ఉన్నాడంటూ ఉద్వేగంతో షేర్‌ చేసిన ఈ పోస్టుకు ‘నేను కోల్పోలేదు.. అన్ని విధాలుగా కలిగి ఉన్నాను’ అనే క్యాప్షన్‌ను జత చేసి పోస్టు చేశారు. ఆమె షేర్‌ చేసిన ఈ ఫొటో ప్రతి ఒక్కరి హృదయాన్ని హత్తుకుంటోంది. సుతప ఆత్మస్థైర్యాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు ఆమెకు మద్దతుగా కామెంట్స్‌ పెడుతున్నారు. క్యాన్సర్‌తో ఇర్ఫాన్‌ ముంబైలోని కోకిలాబెన్‌ దీరుభాయి అంబాని ఆస్పత్రిలో బుధవారం కన్నుమూశారు. ఈ విలక్షణ నటుడి మరణానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించగా... బాలీవుడ్‌ ఓ గొప్ప నటుడి కోల్పోయిందంటూ సోషల్‌ మీడియాలో నెటిజన్ల భావోద్యేగంతో సంతాపం వ్యక్తం చేశారు. (మరణంపై ఇర్ఫాన్‌ ఖాన్‌‌ భావోద్వేగ మాటలు!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు