నాకెంతో ఇష్ట‌మైన వ్య‌క్తి ఆయ‌న: దీపిక

8 May, 2020 10:33 IST|Sakshi

బాలీవుడ్ విలక్ష‌ణ న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ భౌతికంగా దూర‌మైనా, ఆయ‌న పోషించిన పాత్ర‌లు ప్ర‌జ‌ల గుండెల్లో సజీవంగా ఉన్నాయి. ఇర్ఫాన్ న‌టించిన అపురూప‌మైన చిత్రం పీకూ. దీపికా ప‌దుకొణె, అమితాబ్ బ‌చ్చ‌న్ ల‌తో క‌లిసి న‌టించిన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. పీకూ చిత్రం విడుద‌లై నేటికి స‌రిగ్గా ఐదేళ్ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా ఇర్ఫాన్‌తో ఉన్న మ‌ధుర స్మృతుల‌ను దీపిక సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు. 

ఇర్ఫాన్.. అద్భుత‌మైన వ్య‌క్తి. నాకెంతో ఇష్ట‌మైన వ్య‌క్తి అంటూ పోస్ట్ చేశారు. దీపికా ప‌దుకొణె న‌టించిన మొద‌టి హాలీవుడ్ చిత్రానికి సంబంధించి ఓ వేడుక‌లో ఇర్ఫాన్, దీపిక హాజ‌రైన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్  అవుతోంది. వి మిస్ యూ ఇర్ఫాన్ అంటూ ప‌లువురు ఆయ‌న్ని గుర్తుచేసుకుంటున్నారు. క్యాన్సర్‌తో ఏప్రిల్ 29న ఇర్ఫాన్‌ఖాన్ తుది శ్వాస విడిచారు. (మనిషిగా పుట్టడం వరం.. శాశ్వతం కాదు! )

Those special moments ❤ #irrfankhan with #deepikapadukone 🎼 @hrithikroshan . . . #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా