కెప్టెన్‌ జాక్‌ స్పారోను చంపేస్తారట!

16 Jun, 2017 23:00 IST|Sakshi
కెప్టెన్‌ జాక్‌ స్పారోను చంపేస్తారట!

లాస్‌ ఏంజిలెస్‌: కెప్టెన్‌ జాక్‌ స్పారో.. పైరేట్స్‌ ఆఫ్‌ ది కరేబియన్‌ సీరిస్‌ సినిమాల్లో పిల్లాపెద్దలను ఎంతగానో అలరించిన పాత్ర. అయితే ఇకపై ఈ సీరిస్‌లో వచ్చే సినిమాల్లో జాక్‌ స్పారో కనిపించడట. ఎందుకంటే ఆయన పాత్రను చంపేస్తామని నిర్మాణ సంస్థ డీస్నీ తాజాగా ప్రకటించింది. ‘డెడ్‌ మ్యాన్‌ టెల్స్‌ నో టేల్స్‌’ పేరుతో ఇటీవల విడుదలైన సినిమా అంతగా ప్రేక్షకాదరణ పొందకపోవడానికి కారణం కూడా జాక్‌ స్పారో క్యారెక్టర్లో నటించిన జానీ డెప్‌ కారణమని నిర్మాణ సంస్థ భావిస్తోందని, అందుకే ఆయనను ఇకపై వచ్చే సినిమాల్లో పక్కనబెట్టాలని నిర్ణయించే ఆ పాత్రను చంపేయాలనుకుంటున్నారని స్థానిక వెబ్‌సైట్‌ వెల్లడించింది.

నిజానికి ఇప్పటిదాకా విడుదలైన సినిమాల్లో జానీ డెప్‌ పాత్రే ప్రధాన ఆకర్షణ అయినప్పటికీ యువత ఇంకా అతణ్నే చూడాలని కోరుకోవడం లేదని, కాయా స్కోడాల్‌రియో, బ్రెన్‌టన్‌ థ్వైట్స్‌ వంటి కొత్త నటులను చూసేందుకే ఆసక్తి చూపుతున్నారనే విషయం తాజా సర్వేల్లో తేలిందట. అందుకే ఇకపై జాక్‌ స్పారో పాత్రను చంపేసి, దాని స్థానంలో కొత్త పాత్రను సృష్టించేందుకు డిస్నీ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా