తేజస్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది : ప్రకాశ్‌రాజ్

28 Jul, 2015 00:45 IST|Sakshi
తేజస్‌కు మంచి భవిష్యత్తు ఉంటుంది : ప్రకాశ్‌రాజ్

 ‘‘తేజస్ నాకు ‘ఉలవచారు బిర్యానీ’ సినిమా చేస్తున్నప్పట్నుంచీ తెలుసు. అతనికి సినిమా అంటే చాలా ప్యాషన్. కచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అని నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. తేజస్, చాందిని జంటగా వెంకటేశ్ మూవీస్ పతాకంపై వెంకటేశ్ బాలసాని నిర్మించిన చిత్రం ‘కేటుగాడు’. కిట్టు నల్లూరి దర్శకుడు. సాయికార్తీక్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని నిర్మాత  కె.ఎస్. రామారావు ఆవిష్కరించి ప్రకాశ్‌రాజ్‌కు అందించారు.
 
 ఈ సందర్భంగా కె.ఎస్.రామారావు మాట్లాడుతూ -‘‘ఈ సినిమా మొదలు కాకముందు  తేజస్ వచ్చి కథ చెప్పాడు. చాలా బాగుంది. అలాగే చాలా ఎనర్జిటిక్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. సాయికార్తీక్ చాలా మంచి పాటలు ఇచ్చారు’’ అని చెప్పారు. మా సంస్థ నుంచి వచ్చినతొలి చిత్రం ఇదని, అన్ని వర్గాలవారు చూసే విధంగా ఈ చిత్రం ఉంటుందని నిర్మాత అన్నారు. ఈ వేడుకలో హీరో తేజస్, హీరోయిన్ చాందినీ చౌదరి, నటుడు అజయ్, చిత్రసమర్పకుడు వీఎస్పీ తెన్నేటి తదితరులు పాల్గొన్నారు.