కమల్ హాసన్ సంచలన ట్వీట్‌

19 Jul, 2017 10:06 IST|Sakshi
కమల్ హాసన్ సంచలన ట్వీట్‌

చెన్నై: విలక్షణ నటుడు, హీరో కమల్‌ హాసన్‌  తాజా ట్వీట్‌ సంచలనంగా మారింది. దీంతో  ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇటీవలి ఆయన వ్యాఖ్యలు రాజకీయాల ఆస​‍క్తిని సూచన ప్రాయంగా తెలియజేస్తుండగా.. తాజా గా ఆయన ట్విట్టర్‌లో  షేర్‌ చేసిన కవిత  ఈ విషయాన్ని మరింత  ధృవీకరిస్తోంది.

తమిళంలో ఈ 11 లైన్ల ఓ  పవర్‌ ఫుల్‌ కవితను కమల్‌  తన అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘ఇపుడు ఎవ్వరూ రాజుకాదు , విమర్శిద్దాం.. హృదయపూర్వకముగా ఉద్భవిద్దాం..మనం వాళ్లలాగా రాజులు కాము. ఓడిపోయినా..మరణించినా.. నేను తీవ్రవాదినే. నేను నిర్ణయించుకుంటే నేనే 'ముదుల్వార్' (నాయకుడు)ని..నేను బానిసను కాదు..లొంగి ఉండటానికి..కిరీటాన్ని వదిలినంతమాత్రాన   ఓడిపోయినట్టు కాదు..శోధించకపోతే మార్గాలు కనిపించవు. కామ్రేడ్‌, నాతో పాటు రండి...అసంబద్ధతను బద్దలు గొట్టేవాడే  నాయకుడిగా ఉంటారు. " ఇలా తమిళంలో ఆయన కవిత్వం సాగింది.

ఇదే ఇపుడు ఇండస్ట్రీ హాట్‌ టాపిక్‌గా మారింది. గతవారం కమల్‌ బిగ్‌ బాస్‌ షో పై  విలేకరుల సమావేశం సందర్భంగా  తమిళనాడు ప్రభుత్వ శాఖలు అవినీతిమయంగా మారాయని వ్యాఖ్యానించారు. దీంతో వివాదం రేగింది. ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ తమిళనాడు న్యాయ శాఖమంత్రి షణ్ముగం వ్యాఖ్యలు,  ఆర్థికమంత్రి డి.జయకుమార్   దమ్ముంటే రాజకీయాల్లో చేరాలని చేసిన సవాల్‌ను కమల్‌ సీరియస్‌గా తీసుకున్నారా?  అనే  చర్చకు దారి తీసింది.  ప్రజాస్వామ్యంలో ఎవరైనా వారి అభిప్రాయాలను వినిపించవచ్చన్న పన్నీర్‌   సెల్వం వ్యాఖ్యల ద్వారా అటు  డీఎంకేనుంచి  ఈ స్టార్‌ హీరో కు మద్దతు లభించడం విశేషం.     

కాగా  ఇటీవలి కాలంలో కమల్‌  వ్యాఖ్యలను గమనిస్తే రాజకీయాల పట్ల ఆసక్తి చూపుతున్నారనే  అనుమానం రాక మానదు.  ముఖ్యంతా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత కమల్ హాసన్ రాజకీయాలపై విస్తృతంగా వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే.