రామ్‌ గోపాల్‌ వర్మ ఓ జీనియస్‌: నటి

19 Mar, 2020 20:57 IST|Sakshi

వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ చాలా జీనియస్‌ అని ఓ నటి కితాబు ఇచ్చారు. ఆమె ఎవరో కాదు.. 2002లో వర్మ తెరకెక్కించిన ‘కంపెనీ’ సినిమాలో ‘కల్లాస్‌’ పాటలో కనిపించి పేరు తెచ్చుకున్న ఇషా కొప్పికర్‌. ప్రస్తుతం ఈ నటి వర్మ రూపొందిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లో మళ్లీ కనిపించనున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషా మాట్లాడుతూ.. రామ్‌ గోపాల్‌ వర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్‌ గోపాల్‌ వర్మ ఒక మేధావి అని,  తన కెరీర్‌ పరంగా ప్రస్తుతం వర్మ బ్యాడ్‌ ఫేజ్‌లో ఉన్నప్పటికీ భారత సినిమా రంగానికి ఆయన చేసిన సహాకారం మరువలేనిది అన్నారు. (ఆ దర్శకుడితో విజయ్‌ నాలుగో సినిమా!)

‘‘వర్మ అనేక గొప్ప సినిమాలు తెరకెక్కించారు. ఆయన తీసిన సినిమాలను ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వర్మ సినిమాల్లో నేను చూసిన మొదటి హిందీ హర్రర్‌ చిత్రం రాత్‌. అది నాకు ఎంతోగానో నచ్చింది. ఆ తరువాత భూత్‌, రంగీలా, సత్యా వంటి సినిమాలు చేశారు. అయితే కష్ట కాలంలో ఉన్న వర్మ తన రాబోయే చిత్రాల ద్వారా పూర్వ వైభవాన్ని సాధిస్తాడని ఆశిస్తున్నా. అలాగే ప్రస్తుతానికి వెబ్‌ సిరీస్‌ ప్రధాన భాగం షూటింగ్‌ పూర్తి అయ్యింది. ఈ వెబ్‌ సిరీస్‌ను వర్మ నేతృత్వంలో నలుగురు దర్శకులు డైరెక్షన్‌ చేశారు. షూటింగ్‌ పూర్తి చేసిన తర్వాత వాళ్ల పనిని ఆర్జీవికి సమర్పించారు. వర్మ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చూసుకుంటున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల్లో మ్యాజిక్‌ క్రియోట్‌ చేస్తుందని ఆశిస్తున్నా’’. అంటూ చెప్పుకొచ్చారు. (దర్శకుడి ఇంట్లోకి వారసుడు.. పేరేంటో తెలుసా!)

కాగా వర్మ రూపొందించిన కంపెనీ మూవీ.. బాలీవుడ్‌లో మంచి హిట్‌ను సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత కూడా ఇషా వర్మ ప్రొడక్షన్‌లో డార్లింగ్‌, షాబ్రీ సినిమాలోనూ కనిపించారు. ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌తో పాటు తమిళ మూవీ అయలాన్‌లోనూ నటిస్తున్నారు. ఆర్‌ రవికుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, శరద్‌ కేల్కర్‌ కూడా నటిస్తున్నారు. (ఆ స్టార్‌ ప్రేమజంట పెళ్లి వాయిదా!)
సినిమాలోని అది మనం ట్రై చేద్దామా..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా