దర్శకుడు పూరీ లాటరీ లాంటివారు...

10 Jul, 2019 12:59 IST|Sakshi

డాషింగ్ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ఇస్మార్ట్ శంకర్. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా చిత్రయూనిట్‌ విజయవాడలో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో హీరో రామ్‌తో పాటు హీరోయిన్లు నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రామ్‌.. ‘విజయవాడ రావడం సంతోషంగా ఉంది. మా సినిమా ట్రైలర్, సాంగ్స్‌కు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. రామ్, పూరీల సినిమాగా మీడియానే మంచి ప్రచారం ఇస్తోంది. జగడం తర్వాత నేను పూర్తి స్థాయి మాస్ క్యారెక్టర్ చేసిన సినిమా ఇదే. సినిమాలో క్యారెక్టర్ విధానం‌ బట్టి భాష ఉంటుంది. 

సినిమాలకు భాష, ప్రాంతాలు ఉండవు. మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. దర్శకుడు పూరీ లాటరీ లాంటి వారు. కొడితే రికార్డులు బద్దలవ్వాల్సిందే. ఈ నెల 18వ తేదీన సినిమా విడుదల చేస్తున్నాం కథ కోసమే ఇద్దరు హీరోయిన్లతో నటించాను. ఈ సినిమా అన్ని వర్గాల‌ వారిని ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంద’న్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు