ఇది ఒక వినూత్న ప్రయత్నం!

11 Dec, 2013 00:19 IST|Sakshi
ఇది ఒక వినూత్న ప్రయత్నం!
‘‘అందరూ వినూత్న ప్రయత్నం అని అభినందిస్తున్నారు. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అని బెక్కెం వేణుగోపాల్ అన్నారు. హర్షవర్ధన్‌రాణే, శ్రీవిష్ణు, హరీష్, వితిక శేరు, రీతు వర్మ, శ్రీముఖి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ప్రేమ.. ఇష్క్.. కాదల్’. పవన్ సాధినేని దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రం గత వారం విడుదలైంది. ఈ చిత్రం విజయవంతం ప్రదర్శించబడుతోందని చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేశారు. 
 
 ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘అందరూ ఈ సినిమాలోని చివరి 20 నిమిషాల గురించే మాట్లాడుకుంటున్నారు. క్లైమాక్స్ ఈ చిత్రానికి ప్రధాన బలం. మంచి కథాబలం ఉన్న చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ చిత్రం నిరూపించింది’’ అని చెప్పారు. చెప్పాలనుకున్న పాయింట్‌ని ధైర్యంగా చెప్పడంలో దర్శకుడు సఫలుడయ్యాడని మధురా శ్రీధర్ అన్నారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులు మాట్లాడారు.