ఇక్కడ తట్టుకోవడం కష్టమే!

5 Sep, 2017 01:53 IST|Sakshi
ఇక్కడ తట్టుకోవడం కష్టమే!

తమిళసినిమా: సినీపరిశ్రమలో తట్టుకోవడం కష్టమేనటోంది నటి అనుఇమ్మానుయేల్‌. మాలీవుడ్‌ టూ టాలీవుడ్‌ వయా కోలీవుడ్‌గా ఎదుగుతున్న నటి ఈ కేరళాకుట్టి. మలయాళంలో బాలతారగా నటనలో అడుగులు వేసిన అనుఇమ్మానుయేల్‌ ఆ తరువాత కథానాయకి రేంజ్‌కు ఎదిగింది. అక్కడ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు టాలీవుడ్‌లో మజ్ను చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

అక్కడ గోపీచంద్‌తో ఆక్సిజన్‌ అంటూ త్వరలో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్న అనుఇమ్మానుయేల్‌ ప్రస్తుతం అల్లుఅర్జున్‌కు జంటగా నా పేరు సూర్య చిత్రంలో నటిస్తోంది. ఇక కోలీవుడ్‌కు తుప్పరివాలన్‌ చిత్రంతో విశాల్‌కు జంటగా రావడానికి రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఎలాగుంది కేరీర్‌ అన్న ప్రశ్నకు మలయాళంలో నటిగా రంగప్రవేశం చేసి, ఆ తరువాత తెలుగు చిత్రపరిశ్రమలో దిగుమతి అయ్యి ఇప్పుడు తమిళ సినీరంగంలోకి అడుగుపెట్టనున్నాను.

తక్కువ చిత్రాలే చేయడానికి కారణం విజయం తరువాత నటించే చిత్రాలు మంచి చిత్రాలు ఉండాలని కోరుకుంటున్నాను. అందుకే చిత్రాల ఎంపికలో తొందర పడదలచుకోలేదు. నిజం చెప్పాలంటే నా తొలి చిత్రం విడుదలకు ముందే పలు అవకాశాలు తలుపుతట్టాయి. అలా స్టార్‌ హీరోల సరసన నటించే అవకాశాలు రావడంతో కథానాయకిగా నా పయనం సంతోషాన్నిస్తోంది.

అయితే ఇతర భాషా చిత్రాల్లో నటిస్తున్నప్పుడు అమ్మానాన్నలకు దూరంగా చాలా రోజులు ఉండాల్సిరావడం కష్టం అనిపిస్తోంది. అయితే పనిని అధికం చేసుకోవడంతో ఆ కష్టాన్ని మరిచిపోగలుగుతున్నాను. నిత్యం అమ్మానాన్నలతో ఫోన్‌లో మాట్లాడుతుంటాను. అయినా నా దినచర్యలో మార్పులు చేసుకోవలసిన పరిస్థితి. ఉదయాన్నే నిద్ర లేవడం అలవాటు చేసుకుంటున్నాను. సినిమా వాళ్లను తట్టుకోవడం సవాల్‌గానే ఉన్నా నటిగా నా జీవితాన్ని బాగానే అనుభవిస్తున్నాను. సినిమా నన్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళుతుందనే నమ్మకం ఉంది అంటోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా